AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenin Movie: అఖిల్ నాకు కొడుకులాంటి వాడు.. ‘లెనిన్’పై మెగాస్టార్ ప్రశంసలు.. నాగార్జన రియాక్షన్ ఏంటంటే?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. జులై 10న విడుదలైన ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లతో పాటు సినీ దిగ్గజాల ప్రశంసలు కూడా వస్తున్నాయి. తాజాగా అఖిల్ సినిమాపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Lenin Movie: అఖిల్ నాకు కొడుకులాంటి వాడు.. 'లెనిన్'పై మెగాస్టార్ ప్రశంసలు.. నాగార్జన రియాక్షన్ ఏంటంటే?
Akhil Akkineni, Chiranjeevi, Nagarjuna
Basha Shek
|

Updated on: Jul 13, 2026 | 6:45 PM

Share

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 10న విడుదలైన ఈ విలేజ్ ఎమోషనల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు రూ. 16 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన లెనిన్ మూవీ వీకెండ్ లో అదరగొట్టింది. మొత్తానికి మూడు రోజులకు కలిపి రూ. 61 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఓవర్సీస్ లోనూ అఖిల్ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 500 K డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా లెనిన్ సినిమాకు రికార్డు కలెక్షన్లతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి లెనిన్ సినిమాపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి. ‘అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా గురించి అద్భుతమైన విషయాలు వింటున్నాను. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితుడు నాగార్జునకు, మొత్తం చిత్రబృందానికి అభినందనలు. త్వరలో ‘లెనిన్’ చూస్తా. సినిమాకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు చిరంజీవి.

మెగాస్టార్ ట్వీట్ కు నాగార్జున వెంటనే స్పందించారు. ‘ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది’ అని రిప్లై ఇచ్చారు. అలాగే అఖిల్‌ కూడా రియాక్ట్ అయ్యాడు. ‘ థ్యాంక్యూ పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు’ అని రిప్లై ఇచ్చారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లెనిన్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అఖిల్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

 మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us