Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ క్షేమంగానే ఉన్నాడు.. మెడికవర్ ఆస్పత్రి వద్ద పవన్ కళ్యాణ్..

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న మెడికవర్ ఆస్పత్రికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రోడ్డుపై ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్‌ను ఆయన చూశారు.

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ క్షేమంగానే ఉన్నాడు.. మెడికవర్ ఆస్పత్రి వద్ద పవన్ కళ్యాణ్..
Pawan Kalyan


Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న మెడికవర్ ఆస్పత్రికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రోడ్డుపై ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్‌ను ఆయన చూశారు. తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం అక్కడి నుంచి వెనుదిరుగుతూ.. మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ అపస్మారకస్థితిలో ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని అన్నారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదని అన్నారు. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు.

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Also read:

Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి ధరమ్ తేజ్- Watch Video

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం.. షాక్‌లో మెగా ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలంటూ..

Honey Trap: పాకిస్థాన్ ఏజెంట్‌కు రహస్య ఆర్మీ పత్రాల సరఫరా.. రైల్వే పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారి అరెస్ట్..!

Click on your DTH Provider to Add TV9 Telugu