Sai Dharam Tej Accident: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. క్షేమంగా బయటపడటానికి కారణమదే..

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ప్రాణ గండం తప్పింది. ఇప్పటి వరకు అపస్మారకస్థితిలో..

Sai Dharam Tej Accident: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. క్షేమంగా బయటపడటానికి కారణమదే..
Sai Dharam Tej
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 10, 2021 | 11:51 PM

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు ప్రాణ గండం తప్పింది. ఇప్పటి వరకు అపస్మారకస్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడు. ఇదే విషయాన్ని వైద్యులు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్‌ని మాధాపూర్‌లోని మెడ్‌కవర్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్.. ప్రమాద స్థలిలోనే స్పృహ కోల్పోయాడు. దాంతో అతనికి మెడికవర్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్.. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. సాయిధరమ్ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇతర కుటుంబ సభ్యులంతా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.

ఇదిలాఉంటే.. అతివేగంతో బైక్ డ్రైవ్ చేస్తూ కిందపడిన సాయిధరమ్ తేజ్‌ను అతను ధరించిన హెల్మెటే కాపాడింది. అతను హెల్మెట్ ధరించడం వల్ల తలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఆ హెల్మెట్ కారణంగానే సాయిధరమ్ తేజ్.. కొద్దిపాటి గాయాలతో బయటపడగలిగారని పోలీసులు చెబుతున్నారు. మద్యం ఏమీ సేవించలేదని నిర్ధారించారు. ఏదేమైనా.. హెల్మెట్ ధరించడం వల్ల ఆయన ఎటువంటి అపాయంకలుగకుండా సురక్షితంగా ఉండటంతో మెగా ఫ్యామిలీ, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ క్షేమంగానే ఉన్నాడు.. మెడికవర్ ఆస్పత్రి వద్ద పవన్ కళ్యాణ్..

Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి ధరమ్ తేజ్- Watch Video

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం.. షాక్‌లో మెగా ఫ్యాన్స్.. త్వరగా కోలుకోవాలంటూ..