AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daler Mehndi: గాయకుడు దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష.. మానవ అక్రమ రవాణా కేసులో

Daler Mehndi Sentenced: పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది.

Daler Mehndi: గాయకుడు దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష.. మానవ అక్రమ రవాణా కేసులో
Daler Mehndi
Sanjay Kasula
|

Updated on: Jul 14, 2022 | 5:38 PM

Share

మానవ అక్రమ రవాణా కేసులో పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ అప్పీల్‌ను పాటియాలా అదనపు సెషన్స్ జడ్జి తోసిపుచ్చింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. ఈ రోజు అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు. 2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు అయింది. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. విదేశాల్లో పాటలు పాడేందుకు వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలపై ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడే ఒదిలేసేవారు. ఇలా ఈయన పాటల ప్రోగ్రాం జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి అక్కడే ఒదలిపెట్టేవారు.

ఇందులో దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ ప్రమేయం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. విదేశాల్లో ఒదిలి పెట్టి రావడానికి కొంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి తీసుకున్నట్లుగా పోలీసులు అభియోగం మోపడంతో పాటు.. సాక్ష్యాలతో సహా ఋజువు చేశారు. దీంతో ఆయన కోర్టు శిక్ష వేసింది.

2003లో సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మెహందీ సోదరులు 1998, 1999లో రెండు సార్లు ఇలా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఆ సమయంలో 10 మందిని గ్రూప్‌లో సభ్యులుగా యుఎస్‌కు తీసుకెళ్లి అక్రమంగా వదిలిపెట్టారని ఆరోపించారు. మొదటి ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత.. గాయకుడిపై పోలీసులకు మరో 35 ఫిర్యాదులు అందాయి.

కొంతమంది ఫిర్యాదుదారుల ప్రకారం.. దలేర్ మెహందీ  కొంత మంది వ్యక్తులను అక్రమంగా విదేశాలకు (ఎక్కువగా కెనడా, యుఎస్) పంపడానికి బదులుగా వారి నుంచి దాదాపు రూ. 12 లక్షలను తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బుకు బదులుగా తన విదేశీ కార్యక్రమాలలో డ్యాన్స్ ట్రూప్‌లలో భాగంగా వారిని విదేశాలకు పంపుతానని వాగ్దానం చేసేవారు. దీని తరువాత, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని దలేర్ కార్యాలయంపై దాడి చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్న తరువాత పంజాబ్ పోలీసులకు దలేర్ మెహందీకి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయి.

జాతీయ వార్తల కోసం..