AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్: శ్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు

డెహ్రాడూన్ బ్యూటీ శ్రియ శరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా మన దేశంలో కాదు లండన్‌లో. అయితే చాలా సేపటి తరువాత ఆమెను వారు విడుదల చేశారు. ఇంతకు శ్రియను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..? ఆమె చేసిన తప్పేంటి..? చివరకు ఏం జరిగింది..? అంటే..! శ్రియ ప్రస్తుతం తమిళ్‌లో ‘సందకారి’ అనే మూవీలో నటిస్తోంది. ఈ షూటింగ్ కోసం ఇటీవల మూవీ యూనిట్ లండన్‌కు వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో శ్రియపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. […]

షాకింగ్: శ్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 14, 2019 | 2:56 PM

Share

డెహ్రాడూన్ బ్యూటీ శ్రియ శరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా మన దేశంలో కాదు లండన్‌లో. అయితే చాలా సేపటి తరువాత ఆమెను వారు విడుదల చేశారు. ఇంతకు శ్రియను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..? ఆమె చేసిన తప్పేంటి..? చివరకు ఏం జరిగింది..? అంటే..!

శ్రియ ప్రస్తుతం తమిళ్‌లో ‘సందకారి’ అనే మూవీలో నటిస్తోంది. ఈ షూటింగ్ కోసం ఇటీవల మూవీ యూనిట్ లండన్‌కు వెళ్లింది. అక్కడ ఎయిర్‌పోర్టులో శ్రియపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే శ్రియ, అక్కడి పోలీస్ అధికారులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న వారు ప్రశ్నల వర్షం కురిపించడం స్టార్ట్ చేశారు. ఆమె ఎంత చెబుతున్నా వినకుండా  కాస్త ఇబ్బంది పెట్టారు. ఇక ఇది గమనించిన మూవీ యూనిట్.. ఆ పోలీసుల దగ్గరకు వెళ్లి, తాము సినిమా షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ అధికారుల వద్ద తీసుకున్న అనుమతి పత్రాలను మూవీ యూనిట్ పోలీసులకు చూపించింది. దీంతో చివరకు పోలీసులు శ్రియకు సారీ చెప్పి వదిలేశారు. అయితే సెలబ్రిటీలకు ఇలా జరగడం ఇదేం తొలిసారేం కాదు. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ సహా పలువురు హీరో, హీరోయిన్లు విదేశీ ఎయిర్‌పోర్టులలో ఇలాంటి అనుమానాలు పలుసార్లు జరిగిన విషయం తెలిసిందే.

కాగా 2001లో ‘ఇష్టం’ మూవీ ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రియ 18 సంవత్సరాలుగా నిర్విరామంగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ 18ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా ఆమె గ్యాప్ తీసుకోలేదు. ఇక గతేడాది రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను వివాహం చేసుకోగా.. పెళ్లి తరువాత కూడా సినిమాలను కంటీన్యూ చేస్తోంది శ్రియ.