లవ్‌లో నితిన్..మ్యారేజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో యంగ్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. ఇతగాడు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాడా అనే ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ నితిన్ మాత్రం ఆ టాపిక్ వస్తేనే ఆమడ దూరం పారిపోతున్నాడు. అయితే ఈ యంగ్ పెళ్లి సంబంధించిన మేటర్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. నితిన్‌ త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకబోతున్నాడని టాక్.  ప్రస్తుతం ఈ కుర్ర హీరో  ఓ అమ్మాయితో పీకల్లోతు  ప్రేమలో […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:52 pm, Sat, 14 December 19
లవ్‌లో నితిన్..మ్యారేజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో యంగ్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. ఇతగాడు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటాడా అనే ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. కానీ నితిన్ మాత్రం ఆ టాపిక్ వస్తేనే ఆమడ దూరం పారిపోతున్నాడు. అయితే ఈ యంగ్ పెళ్లి సంబంధించిన మేటర్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

నితిన్‌ త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకబోతున్నాడని టాక్.  ప్రస్తుతం ఈ కుర్ర హీరో  ఓ అమ్మాయితో పీకల్లోతు  ప్రేమలో ఉన్నాడని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మ్యారేజ్‌కి ముహుర్తం ఫిక్స్ చేశారని సమాచారం. దీంతో నితిన్ మనుసు దోచిన ఆ సుందరాంగి ఎవరా అని వెతుకులాట ప్రారంభించారు సినీ జనాలు. ఈ విషయం రూమరో, నిజమో తెలీదు కానీ రోజుకో అప్డేట్‌తో నితిన్ మ్యారెజ్ ఇష్యూ ఫిలిం సర్కిల్‌లో వైరల్‌గా మారింది.

తాజాగా ఆమె తెలుగమ్మాయే అని కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. దుబాయ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్‌ చేసుకోవాలని ఈ కపుల్ ఫిక్సయ్యారట. ప్రజంట్ నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ మూవీ చేస్తున్నాడు. లెట్స్ సీ, ఈ మూవీ ప్రమోషన్స్‌లో అయినా మనోడు ఓపెన్ అవ్వక తప్పదు.