AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagapathi Babu: మూడు కోట్ల అప్పు తీర్చడానికి ఆ పని చేశా.. ఆరోజు మాత్రం నా భార్య చాలా బాధపడింది: జగపతి బాబు

పెద్ది సినిమాలో జగపతి బాబు పోషించిన అప్పల సూరి పాత్ర బాగా హైలెట్ అయ్యింది. అందులో జగ్గూభాయ్ నటించిన విధానాన్ని చూసి ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నారు. కాగా గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు జగ్గూభాయ్.

Jagapathi Babu: మూడు కోట్ల అప్పు తీర్చడానికి ఆ పని చేశా..  ఆరోజు మాత్రం నా భార్య చాలా బాధపడింది: జగపతి బాబు
Jagapathi Babu
Basha Shek
|

Updated on: Jun 12, 2026 | 6:31 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చి బాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అప్పల సూరి అనే ఓ ఏజ్డ్ రోల్ లో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈ అప్పల సూరి పాత్ర ఆడియెన్స్ తో కన్నీరు పెట్టించిందంటే అతి శయోక్తి కాదు. అంతలా ఈ పాత్రలో ఒదిగిపోయారు జగపతి బాబు. కాగా పెద్ది ప్రమోషన్లలో జగ్గూ భాయ్ కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. సాధారణంగా జగపతి బాబు ఏ ఇంటర్వ్యూలో నైనా సినిమాల సంగతి తప్పితే తన ఫ్యామిలీ గురించి మాట్లాడదు. భార్య, కూతుళ్ల ప్రస్తావన కూడా తీసుకురారు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారీ సీనియర్ హీరో.

‘కొన్నాళ్ల క్రితం నా ఇంటిని అమ్మేశాను. మూడు కోట్ల అప్పు తీర్చడానికే ఆ పని చేశాను. అయితే ఆ ఇంటిని ఖాళీ చేసేటప్పుడు నేను ఇంట్లో లేను. ‘లెజెండ్‌’ సినిమా షూటింగ్ లో ఉన్నాను. నా భార్య, పిల్లలు మాత్రమే వెకేట్‌ చేశారు. నేను లేకపోవడం అనేది నాకు బాధనపించలేదు. కానీ ఫ్యామిలీ, సెంటిమెంట్‌ అనే యాంగిల్‌లో చూస్తే చాలా బాధగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నా పరిస్థితి వేరేలా ఉంది. ఎలాంటి ఎమోషన్స్ లేవు. ఈ విషయంలో నా భార్య బాగా బాధపడి ఉండొచ్చు. కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ నాతో చెప్పలేదు. ఆడవారికి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా ఇల్లు ఖాళీ చేసే సమయంలో వాళ్ల వెంట నేను లేను. కాబట్టి వారికి ఆ బాధ కచ్చితంగా ఉంటుంది’

‘నా భార్య, పిల్లల గురించి నేను పెద్దగా మాట్లాడను. ఎందుకంటే వాళ్లకు ఈ పబ్లిసిటీ ఇష్టం లేదు. మీడియాలో రావాలని, బయటకు ఎక్స్ పోజ్‌ కావాలని ఎప్పుడూ అనుకోరు. వారికి కూడా అది నచ్చదు. అందుకే మేం ఎప్పుడైనా బయటకు వెళ్లినా కూడా నా భార్య నా వెంట నడవదు. ముందు అయినా వెళ్లి పోతారు. లేదా వెనకాల అయినా వస్తారు’ అని చెప్పుకొచ్చారు జగపతి బాబు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us