Peddi Movie: పెద్ది మేనియా.. ‘చికిరి’ సాంగ్‌కు స్టెప్పులేసిన వరుడు.. వధువు ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వాగదు
ప్రస్తుతం పెద్ది మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలు, డైలాగులే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ది సినిమా సాంగ్స్ రీల్స్, డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తున్నాయి. అలా తాజాగా ఓ కొత్త పెళ్లి కొడుకు చికిరి సాంగ్ కు అద్భుతంగా స్టెప్పలేశాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కేవలం 7 రోజుల్లోనే రూ. 345 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు డైరెక్షన్ పెద్ది సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ రామ్ చరణ్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. సోషల్ మీడియాలోనూ ఈ సాంగ్స్ కు సంబంధించిన రీల్స్, వీడియోలే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్లు సైతం పెద్ది సినిమా సాంగ్స్ కు కాలు కదుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్రెండింగ్ వీడియోలను ఇటీవల పెద్ది ఈవెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడు చికిరి చికిరి సాంగ్ కు స్టెప్పులేశాడు. ఓ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తన లైఫ్ పార్ట్ నర్ ముందే ఎంతో హుషారుగా స్టెప్పులేశాడు. వరుడి డ్యాన్స్ చూసి నూతన వధువు ముసిముసి నవ్వులు కురిపించింది. ఇక పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు వరుడి డ్యాన్స్ చూసి చప్పట్లు కొట్టి అభినందించారు. ఇక పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయితే వరుడిని మరింత ఎంకరేజ్ చేస్తూ అతని డ్యాన్స్ మూమెంట్స్ ను తమ సెల్ ఫోన్ లో షూట్ చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ కొత్త పెళ్లి కొడుకు డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అతని డ్యాన్స్ పెర్ఫామెన్స్ కి అలాగే వధువు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు లైకులు, షేర్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా పెద్ది సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా రైరా రారా అనే సాంగ్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అలాగే వారానికి వెయ్యి అంటూ సాగే స్పెషల్ సాంగ్స్ కు కూడా జనాలు స్టెప్పులేస్తూ రీక్రియేట్ చేస్తున్నాను. మొత్తానికి పెద్ది సినిమాతో పాటు సాంగ్స్ కూడా ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంటున్నాయి.
వీడియో ఇదిగో..
Cringe 😬😬 anipinchadam ledhaa #Peddi pic.twitter.com/MiHFAwWZu2
— AVM (@AvmNews7) June 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




