పరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థానికి వేలాయే.. 150 మంది అతిథుల సమక్షంలో రింగ్స్ మార్చుకోనున్న క్యూట్ కపుల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల ఎంగేజ్‌మెంట్‌కు అంతా రెడీ అయింది. రేపు (శవివారం) వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంట్రల్ ఢిల్లీలో వీరి ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సమాచారం. తెలుస్తోంది. వీరి నిశ్చితార్థ వేడుకకు...

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల ఎంగేజ్‌మెంట్‌కు అంతా రెడీ అయింది. రేపు (శవివారం) వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సెంట్రల్ ఢిల్లీలో వీరి ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సమాచారం. తెలుస్తోంది. వీరి నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. 150 మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ వేడుకలో ముందుగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారని.. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకోనున్నట్లు తెలిపారు.
అతిథుల కోసం ప్రత్యేకంగా లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది. పరిణితీ ఇంటి వద్ద పండగ వాతావరణ నెలకొంది. ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇదిలా ఉంటే పరిణితీ.. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోగ్రఫీ సైనా మూవీలో లీడ్ క్యారెక్టర్‌లో నటించారు. మేరీ ప్యారీ బిందు, గోల్‌మాల్ ఎగైన్, నమస్తే ఇంగ్లాండ్, కేసరి, ది గర్ల్ ఆన్ ది ట్రైన్, కోడ్ నేమ్ తిరంగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ఊంచాయ్. ప్రస్తుతం చమ్కీలా, క్యాప్సుల్ గిల్ సినిమాల్లో నటిస్తున్నారు పరిణీతి.




View this post on Instagram
ఇక రాఘవ్ ఛద్దా విషయానికొస్తే.. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీకీ రాఘవ్ ఛద్దా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడే పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. కొంతకాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. గతంలో జంటగా కలిసి తిరుగుతూ మీడియా కంట కూడా పడ్డారు. పెళ్లి గురించి ఆరా తీసిన విలేకరులకు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారే తప్ప తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటపెట్టలేదు. ఇక తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటోన్నట్లు వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
