AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీని షేక్ చేస్తున్న సిరీస్.. 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న పంచనామా

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘పంచనామా’ సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఓటీటీని షేక్ చేస్తున్న సిరీస్.. 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతోన్న పంచనామా
Panchanama
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2026 | 8:49 PM

Share

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎండింగ్ చూస్తే ఇది అంతం కాదు.. ఆరంభం అన్నట్టుగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఈ మొదటి సీజన్‌ను తెరకెక్కించారు.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ కచ్చితంగా నచ్చుతుంది. అందుకే జీ5లో కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా భరత్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త యాంగిల్‌లో భరత్ తన పాత్రను పోషించారు. మోహన్ శ్రీవత్స మేకింగ్, నరేష్ కుమరన్ ఆర్ఆర్, సందీప్ కాంత్ కెమెరావర్క్ ఇవన్నీ కూడా సిరీస్‌ను నిలబెట్టాయి. ఈ సిరీస్‌లో మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ పోషించిన పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి.

ఇవి కూడా చదవండి

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us