AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరు నెలల బిడ్డను పట్టుకుని ఈడ్చుకెళ్లిన పిట్‌బుల్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యాలు!

హర్యానాలోని సోనిపట్‌లో ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి ముఖం, పొత్తికడుపు సహా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ భయానక దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చిన్నారికి ప్రస్తుతం PGIMSలో చికిత్స కొనసాగుతోంది. పెంపుడు జంతువుల బాధ్యత, చిన్నారుల భద్రతపై ఈ సంఘటన మరోసారి చర్చకు దారితీసింది.

ఆరు నెలల బిడ్డను పట్టుకుని ఈడ్చుకెళ్లిన పిట్‌బుల్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యాలు!
Pitbull Attack On Baby
Balaraju Goud
|

Updated on: Sep 18, 2026 | 8:40 PM

Share

హర్యానా: ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ కుక్క దాడి చేసిన ఘటన హర్యానాలోని సోనిపట్‌లో కలకలం రేపింది. సిక్కా కాలనీలో సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడగా, అతడిని ప్రస్తుతం రోహ్‌తక్‌లోని PGIMSలో చికిత్స అందిస్తున్నారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిన్నారి తన అత్త ఒడిలో ఉండగా, సమీపంలోని ఓ ఇంటి గేటు తెరుచుకుంది. అదే సమయంలో బయటకు వచ్చిన పిట్‌బుల్ ఒక్కసారిగా వారిపై దూసుకొచ్చింది. మొదట మహిళపై దాడి చేసిన కుక్క.. ఆ తర్వాత ఆమె ఒడిలో ఉన్న చిన్నారిని పట్టుకుంది. దాడి తీవ్రతకు చిన్నారి కిందపడిపోగా, కుక్క అతడిని పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. చిన్నారిని రక్షించేందుకు బువా ప్రయత్నించగా ఆమె కూడా గాయపడినట్లు అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను చిన్నారి నుంచి వేరు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొంతసేపటి తర్వాత చిన్నారిని కుక్క నుంచి విడిపించారు. దాడిలో చిన్నారి ముఖం, పొత్తికడుపు, చేతులు సహా పలు శరీర భాగాలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా, పొత్తికడుపు గాయాలకు శస్త్రచికిత్స చేసి సుమారు 20 కుట్లు వేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స ఖర్చు పెరగడంతో అనంతరం చిన్నారిని రోహ్‌తక్ PGIMSకు తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. తాజా వైద్య సమాచారం ప్రకారం చిన్నారి పరిస్థితి కాస్త మెరుగైనట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పశుపోషణలో బాధ్యత, పెంపుడు కుక్కల నియంత్రణ, చిన్నారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, ఇప్పటివరకు చిన్నారి కుటుంబం పోలీసులకు అధికారిక ఫిర్యాదు ఇవ్వలేదని సోనిపట్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us