ప్రియాంకా ! నీకు ‘ పోటీ ‘ వచ్చేస్తోందా ? నిక్ జొనాస్ తో పాక్ నటి !

ప్రియాంకా ! నీకు ' పోటీ ' వచ్చేస్తోందా ? నిక్ జొనాస్ తో పాక్ నటి !

గ్లోబల్ ఫేమస్ కపుల్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ జీవితాల్లో మరో కొత్త వ్యక్తి ఎంటరయినట్టు కనిపిస్తోంది. . ఆమె ఎవరో కాదు.. పాకిస్తాన్ నటి మెహ్ విష్ హయత్.. ఇటీవలే నిక్ తో కలిసి ఈ అమ్మడు న్యూయార్క్ లో రాఫెల్ నాదల్, మెటియో బెరెటిని పోటీ పడిన మెన్స్ సెమి-ఫైనల్ చూసింది. ఈ పోటీలో రాఫెల్ ఆటతీరు చూడడానికే తాము ఎంతో ఆసక్తి చూపామని మెహ్ విష్ తెలిపింది. […]

Pardhasaradhi Peri

| Edited By:

Sep 09, 2019 | 5:53 PM

గ్లోబల్ ఫేమస్ కపుల్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ జీవితాల్లో మరో కొత్త వ్యక్తి ఎంటరయినట్టు కనిపిస్తోంది. . ఆమె ఎవరో కాదు.. పాకిస్తాన్ నటి మెహ్ విష్ హయత్.. ఇటీవలే నిక్ తో కలిసి ఈ అమ్మడు న్యూయార్క్ లో రాఫెల్ నాదల్, మెటియో బెరెటిని పోటీ పడిన మెన్స్ సెమి-ఫైనల్ చూసింది. ఈ పోటీలో రాఫెల్ ఆటతీరు చూడడానికే తాము ఎంతో ఆసక్తి చూపామని మెహ్ విష్ తెలిపింది. (అన్నట్టు ఈ పోటీలో మెటియో పై రాఫెల్ విజయం సాధించాడు). ఒకప్పుడు బాలాకోట్ వైమానిక దాడులను సమర్థించిన ప్రియాంక చోప్రాను మెహ్ విష్ దుయ్యబట్టింది. ‘ నీ దేశ భక్తి రేసిజంతో కూడుకున్నదని ‘ ట్వీట్ల మీద ట్వీట్లు చేసింది. కాగా- ఈ నటి అదృష్టమో (?) ఏమోగానీ ఈమె న్యూయార్క్ చేరుకున్నప్పుడు ప్రియాంక ఈ సిటీలో లేదు. తన ‘ ది స్కై ఈజ్ పింక్ ‘ మూవీని ప్రమోట్ చేసుకునేందుకు కెనడా వెళ్ళింది. నిజానికి ఎప్పుడూ నిక్, ప్రియాంక ఇద్దరూ కలిసే వెళ్లేవారు. కానీ ఎందుకో ఈ సారి ప్రియాంక ఒక్కరే వెళ్లడం ఆశ్చర్యమంటున్నారు. ఇక’ న్యూయార్క్ లో పురుషుల సెమి ఫైనల్స్ ను ఎవరితో కలిసి నేను చూశానో గెస్ చేయండి చూద్దాం.. రాఫెల్ ఆట తీరును చూసేందుకే.. ఈ విషయంలో నేను, నిక్ ఏకీభవించాం ‘ అని మెహ్ విష్ ట్వీట్ చేస్తూ తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. కాగా- ఇస్లామీకరణపై బాలీవుడ్ ద్వేషాన్ని వెలిగక్కుతోందని ఆ మధ్య ఈ పాకిస్తాన్ నటి ధ్వజమెత్తింది. పైగా షారుఖ్ ఖాన్ తన నెట్ ఫ్లిక్ మూవీలో పాక్ వ్యతిరేక పోకడలను జొప్పిస్తున్నాడని కూడా మెహ్ విష్ హయత్ ఆరోపించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu