AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Teaser: గోపిచంద్ స్పై థ్రిల్లర్.. ఇంట్రస్టింగ్‌గా టీజర్

యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా కొత్త దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో గోపిచంద్ భారత ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ ‘రా’ ఆఫీసర్‌గా నటించాడు. థ్రిల్లర్‌ కథాంశాలతో వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే […]

Chanakya Teaser: గోపిచంద్ స్పై థ్రిల్లర్.. ఇంట్రస్టింగ్‌గా టీజర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 5:35 PM

Share

యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా కొత్త దర్శకుడు తిరు తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ చాణక్య. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో గోపిచంద్ భారత ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ ‘రా’ ఆఫీసర్‌గా నటించాడు. థ్రిల్లర్‌ కథాంశాలతో వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గోపిచంద్ కసితో ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇక ఈ మూవీలో గోపిచంద్ సరసన మెహరీన్ రెండోసారి జత కట్టగా.. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా.. అబ్బూరి రవి మాటలను అందించారు.

కాగా లౌక్యం తరువాత గోపిచంద్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. జిల్ యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ.. సౌఖ్యం, గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం మూవీలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం గోపిచంద్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఆశలన్నీ చాణక్యపైనే ఉన్నాయి. స్పై థ్రిల్లర్‌లకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో తన సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ గోపిచంద్‌కు ఎలాంటి హిట్‌ను ఇస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ మూవీ తరువాత సంపత్ నది దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు గోపిచంద్.

Follow Us