Balochistan – Bangladesh 2.0: బలూచిస్తాన్‏లో పాక్ అక్రమాలను అద్దంపట్టే వెబ్ సిరీస్.. సాహసోపేతంగా కవర్ చేసిన న్యూస్ 9 ప్లస్ టీమ్..

బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై న్యూస్9 ప్లస్ బహిర్గతం చేయడంపై పాకిస్థాన్ ప్రభుత్వం ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసింది. బలూచిస్తాన్‌లో జరిగిన దాడుల గురించి న్యూస్ 9 ప్లస్ చేసిన గ్రౌండ్ కవరేజీని ఆపేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తిరస్కరించింది.

Balochistan – Bangladesh 2.0: బలూచిస్తాన్‏లో పాక్ అక్రమాలను అద్దంపట్టే వెబ్ సిరీస్.. సాహసోపేతంగా కవర్ చేసిన న్యూస్ 9 ప్లస్ టీమ్..
Balochistan Bangladesh 2.
Follow us

|

Updated on: Feb 07, 2023 | 8:26 PM

ఎక్కడ చూసిన మానవ హక్కుల ఉల్లంఘనలు..ఎదురుతిరిగితే దూసుకోస్తున్న బుల్లెట్స్.  అయితే ఈ సమయంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంగ్లీష్ న్యూస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ న్యూస్ 9 ప్లస్ చేసిన బలూచిస్తాన్.. బంగ్లాదేశ్ 2.0 సిరీస్ సంచలనం సృష్టించింది. న్యూస్ 9 ప్లస్ సాహసోపేతంగా చేసిన ఈ సిరీస్ బలూచిస్తాన్‏లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన.. అక్కడి చైనా జాతీయులపై జరిగిన దాడులను ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. అయితే సిరీస్ స్ట్రీమింగ్ అడ్డుకునేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై న్యూస్9 ప్లస్ బహిర్గతం చేయడంపై పాకిస్థాన్ ప్రభుత్వం ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసింది. బలూచిస్తాన్‌లో జరిగిన దాడుల గురించి న్యూస్ 9 ప్లస్ చేసిన గ్రౌండ్ కవరేజీని ఆపేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తిరస్కరించింది.

న్యూస్9 ప్లస్‌లో ఈ ‘బలూచిస్తాన్ – బంగ్లాదేశ్ 2.0’ రెండు-భాగాల సిరీస్‏గా విడుదలైంది. ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘనలను, బలూచిస్తాన్‌లో చైనా జాతీయులపై దాడుల గురించి ఈ సిరీస్‍లో ప్రస్తావించింది. ‘బలూచిస్తాన్: బంగ్లాదేశ్ 2.0’ పాకిస్తాన్ చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై న్యూస్9 ప్లస్ సిరీస్ చేసి విడుదల చేయడంపై పాకిస్థాన్ ప్రభుత్వం ట్విట్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (PTA) డిసెంబర్ 25న 2022న డాక్యుమెంట్-సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది.

పాక్ చేసిన అభ్యంతరం మేరకు.. ఈ డాక్యుమెంటరీ గురించి ఫిబ్రవరి 5న న్యూస్9 ప్లస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్‌ను ట్విట్టర్ సంప్రదించింది. పాకిస్తాన్ ఆర్మీ, ఫ్రాంటియర్ కార్ప్స్ నుంచి వచ్చిన అడ్డంకులను ఎదుర్కొంటూ బలూచిస్తాన్‌లో న్యూస్9 ప్లస్ యూనిట్ ప్రయాణించిన డాక్యుమెంట్-సిరీస్‌కు కౌల్ డైరెక్టర్‏గా వ్యవహరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. “పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ మానవ హక్కుల ఉల్లంఘన, బలూచ్ ప్రజలను హింసించడంపై మేము దర్యాప్తు చేస్తున్నాము. కథనాన్ని నివేదించేటప్పుడు, మేము ప్రావిన్స్‌లోని కార్యకర్తలు, జర్నలిస్టులు, సాధారణ ప్రజలతో మాట్లాడాము, భయంకరమైన హింస, వర్చువల్ చైనీస్ కాలనీగా మార్చబడిన ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాము. మా బలూచిస్థాన్ సిరీస్‌పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయడం భావప్రకటనా స్వేచ్ఛపై దాడి, మేము లేవనెత్తిన ప్రశ్నలను మాత్రమే సమర్థిస్తుంది” అని ఆదిత్య రాజ్ కౌల్ అన్నారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 2022లో ముంబై 26/11 దాడుల సూత్రధారి, ISI ఆస్తి సాజిద్ మీర్‌పై న్యూస్9 ప్లస్ స్టోరీ ‘ఇంటర్‌కాంటినెంటల్ టెర్రరిస్ట్’ కోసం ఆదిత్య రాజ్ కౌల్‌తో సహా సోషల్ మీడియా వాయిస్‌లు, జర్నలిస్టులను కనుగొనడానికి, అలాగే వారిని అరెస్టు చేయడానికి పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ మీడియాను అణిచేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు.. అలాగే ఇస్లామాబాద్ వాస్తవాలను దాచడానికి.. వాటితోపాటు.. బలూచిస్తాన్‌ను ప్రపంచ మీడియాకు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఈ ప్రావిన్స్‌లో చైనా పెట్టుబడి ప్రణాళికలపై బలూచ్ తిరుగుబాటుదారుల ఆగ్రహం కూడా ఈ హింస పెరగడానికి కారణమని చెప్పవచ్చు. బీజింగ్ ప్రావిన్స్ గుండా వెళుతున్న చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లో పెట్టుబడులను విస్తరిస్తూనే ఉంది. చైనీస్ స్థానికులను దూరం చేయడంపై బలూచిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, గత కొన్ని సంవత్సరాలుగా చైనా జాతీయులపై హింసాత్మక దాడులు పెరుగుతున్నాయి. అయితే న్యూస్ 9 ప్లస్‏లో వస్తోన్న ఈ డాక్యూమెంటరీ పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో ఈ కథనంపై పాక్ చేసిన ఆరోపణలను ట్విట్టర్ రిజెక్ట్ చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ప్రతిరోజూ అగరుబత్తీలు వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!
అలారం మోగినా.. అలాగే పడుకుంటున్నారా.?
అలారం మోగినా.. అలాగే పడుకుంటున్నారా.?
మధుమేహం ఉన్నవారికి ఏ పిండి రొట్టె షుగర్‌ లెవల్స్‌ పెంచదు!
మధుమేహం ఉన్నవారికి ఏ పిండి రొట్టె షుగర్‌ లెవల్స్‌ పెంచదు!
రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ
రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
దేవర మూవీ అప్డేట్.. గోవాలో జూనియర్ ఎన్టీఆర్ పై ఫైట్ సీక్వెన్స్
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
'ఫూల్ మఖానా vs పాప్‌కార్న్' వీటిల్లో ఏది ఎక్కువ ఆరోగ్యకరం?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
కొత్త కెప్టెన్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదృష్టం మారేనా..
పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
పాదాల్లో కనిపించే ఈ లక్షణాలు.. గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.