ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్, సూపర్ హిట్ చిత్రాలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. థ్రిల్లింగ్ వెబ్ సిరీస్..ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను డబ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‌ను తీసుకువస్తుంది. అదే ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో షన్ను క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్య సిరీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు షన్ను. టైటిల్ వరకు పోటిపడి రన్నరప్ గా నిలిచాడు.
బిగ్ బాస్ తర్వాత షన్ను పెద్దగా కనిపించనుంది. ఆ తర్వాత ఈ యూట్యూబ్ స్టార్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఏజెంట్ ఆనంద్ సంతోష్ అంటూ రాబోతున్నాడు షన్ను. ఈ సిరీస్ కు డైరెక్టర్ అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తుండగా.. సుబ్బు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ.. షన్ను ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా.. అందులో చేతిలో సూట్ కేస్ పట్టుకుని ఉండగా.. దానిపై కేస్ క్లోజ్డ్ అని కనిపిస్తుంది. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా వెబ్ సిరీస్ లలో అలరించిన షన్ను ఇప్పుడు డిటెక్టివ్‌గా మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
Chantabbayi ki varasudu, Athreya ki thammudu. Parihasam lo kaani, parishkaram lo kaani, ekkada thaggede le. #AASFirstLook#AASOnAHA @shannu__7 @infinitummediaa pic.twitter.com/snYLkNPfGo
— ahavideoin (@ahavideoIN) July 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.