Varasudu OTT: డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన విజయ్ దళపతి సినిమా.. వారసుడు ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
వారసుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. థియేట్రికల్ పూర్తి కావొస్తుండడంతో ఫిబ్రవరి 10 నుంచి విజయ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన తాజా చిత్రం వారసుడు (తమిళ్‌లో వారిసు). టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక ముందన్నా విజయ్ సరసన హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న (తెలుగులో జనవరి 14) విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో సంక్రాంతి సీజన్‌ను భారీగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూల్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక విజయ్ నటన, రష్మిక అంద చందాలు, పాటలు వారసుడు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కాగా సంక్రాంతి సీజన్ ముగియడం, కలెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టడంతో వారసుడు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది. వారసుడు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి కావొస్తుండడంతో ఫిబ్రవరి 10 నుంచి విజయ్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది.
కాగా ఇటీవల చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు కొద్దిరోజుల్లోనే ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ఈక్రమంలో వారసుడు కూడా థియేట్రికల్ రిలీజ్ తర్వాతి నెలరోజులకే ఓటీటీలో అడుగుపెట్టనుంది. వారసుడు సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. శరత్‌కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్ విలన్‌గా మెప్పించాడు. కాగా ఇదే సినిమాకు పోటీగా విడుదలైన అజిత్ తునివు కూడా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#Varisu On Amazon Prime Video from February 10
The Boss Returns pic.twitter.com/85BLe54tV8
— OTT CINEMA UPDATES (@OTTCINEMAUP) January 21, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.