
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 25) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ఇటీవలే థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా కూడా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే నెల తిరక్కుండానే ఓటీటీలోకి రానుంది. సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. అమ్మాయిల హత్యల చుట్టూ తిరిగే స్టోరీ. రమ్య అనే అమ్మాయి హత్యతో ఈ సినిమా కథ మొదలవుతుంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ మండే స్వభావం ఉన్న డ్రగ్ ను ఆమెలోకి ఇంజెక్ట్ చేసి చంపేస్తారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ ధృవ రంగంలోకి దిగుతాడు. పదేళ్ల క్రితం అతని కూతురు కూడా ఇలాగే హత్యకు గురవడంతో ధ్రువ ఈ కేసును పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలా తనకు దొరికిన ఆధారాలతో అరవింద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుంటాడు. అతడిని విచారిస్తే.. ఎవరూ ఊహించలేని కొన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయి. అరవింద్ వింత ప్రవర్తన, అతీంద్రయ శక్తికి ధృవ ఆశ్చర్యపోతాడు.
మరి అరవింద్ కు, అమ్మాయిల హత్యలకు సంబంధమేంటి? ధృవ కూతురిని చంపింది ఎవరు? అసలు కిల్లర్ మోటివ్ ఏంటి? ధ్రువ ఈ కేసును సాల్వ్ చేయగలిగాడా? కిల్లర్ ను పట్టుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ క్రైమ్ థ్రిల్లర్ పేరు మార్గన్. బిక్షగాడు ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించాడు. అజయ్ దిశాన్, బ్రిగిడా, దీప్శిఖ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రవారం ( జులై 25) మార్గన్ సినిమా టెంట్ కొట్టలో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి రానుందట. అయితే తెలుగు వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
🖤 When shadows speak, the devil listens…#Maargan – The Black Devil is ready to rise and reign!
💥 Streaming from July 25 only on @Tentkotta 🎬🔥 (Excluding India)✨Subscribe Now ▶️ https://t.co/zz0ZAaNTUa
Go legal say No to Piracy @vijayantony @AJDhishan990… pic.twitter.com/sXqQF7BBoa— Tentkotta (@Tentkotta) July 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..