AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీల్లోకి బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చునంటే.?

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమవుతున్నాయి. థియేటర్లలోకి ప్రతీ శుక్రవారం వరుసగా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ..

OTT Movies: ఓటీటీల్లోకి బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చునంటే.?
Ott Movies
Ravi Kiran
|

Updated on: May 11, 2023 | 7:30 AM

Share

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమవుతున్నాయి. థియేటర్లలోకి ప్రతీ శుక్రవారం వరుసగా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ.. చాలామంది ప్రేక్షకులు ఓటీటీలలోనే మూవీస్ చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ఫ్యాన్స్‌ ముందుకు వచ్చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ఓటీటీలోకి వస్తోన్న 4 బ్లాక్‌బస్టర్ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

శాకుంతలం:

స్టార్ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పీరియాడికల్‌ మూవీ ‘శాకుంతలం’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. తొలి ఆటతోనే నెగటివ్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కీలక పాత్రలో నటించింది. ఇక థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని శాకుంతలం సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. మే 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

విరూపాక్ష:

సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్తా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్‌ న్యాచురల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఏప్రిల్ 21న థియేటర్లలోకి విడుదలై బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబడుతోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా విరూపాక్ష డిజిటల్ స్ట్రీమింగ్‌పై ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రూపాక్ష సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విక్రమ్‌ వేద:

బీ-టౌన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విక్రమ్‌ వేద’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రం జియో సినిమాలో మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

భేడియా:

వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ చిత్రం ‘భేడియా’. గతేడాది నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది. అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ‘తోడేలు’ పేరిట విడుదలైంది. ఇక సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఈ నెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌