దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ తర్వాత విలన్ గానూ సక్సెస్ అయ్యింది. కొన్ని నెలల క్రితం తన ప్రియుడితో కలిసి పెళ్లి పీటలెక్కిందీ అందాల తార. అయితే పెళ్లికి ముందు వరలక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శబరి. దర్శకుడు అనిల్ కాట్జ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది మే 3న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజైంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శబరి సినిమా ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. థ్రిల్లింగ్ అంశాలు మెండుగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటివరకు ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఎట్టకేలకు తాజాగా శబరి సినిమాపై ఓటీటీ అప్డేట్ వచ్చింది. దసరా కానుకగా వరలక్ష్మి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ శబరి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి శబరి సినిమాను ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది సన్ నెక్ట్స్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్ విడుదల చేసింది ఓటీటీ సంస్థ.
శబరి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు గణేశ్ వెంకటరామన్, మైమ్ గోపి, బేబి కృతిక, శశాంక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించగా, గోపీసుందర్ బాణీలు అందించారు. సినిమాటోగ్రాఫర్ గా రాహుల్ శ్రీ వాస్తవ, నాని వ్యవహరించారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఇక శబరి చిత్రంలో కూతురుని కాపాడుకునే తల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించింది. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయ్యారా? అయితే వీకెండ్ లో టైమ్ పాస్ కోసం శబరిపై ఒక లుక్ వేయచ్చు.
Looking for a breathtaking action thriller? We’ve something for you! 🔥#Sabari streaming exclusively only on #SunNXT from October 11 in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi.#VaralaxmiSarathkumar #GaneshVenkatraman #AnilKatz #SabariFromOctober11 #SabariOnSunNXT… pic.twitter.com/AN2WP8GMhL
— SUN NXT (@sunnxt) October 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.