Aadikeshava OTT: క్రిస్మస్‌ కంటే ముందుగానే ఓటీటీలోకి ఓటీటీలో ‘ఆది కేశవ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

నవంబర్ 24 వతేదీన థియేటర్లలోకి అడుగుపెట్టిన ఆది కేశవ ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోటీన్‌ కథ, కథనాలు కావడంతో సినిమాకు మైనస్‌గా మారాయి. మరీ వయెలెన్స్‌ ఎక్కువైందని ట్రోల్స్‌ వచ్చాయి. అయితే వైష్ణవ్‌- శ్రీలీల జోడి యూత్‌ను బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి హుషారైన స్టెప్పులు ఆడియెన్స్‌ను అలరించాయి

Aadikeshava OTT: క్రిస్మస్‌ కంటే ముందుగానే ఓటీటీలోకి ఓటీటీలో ఆది కేశవ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Aadikeshava Movie

Updated on: Dec 18, 2023 | 4:00 PM

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌, లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌ విలన్‌గా నటించాడు. నవంబర్‌ 24న థియేటర్లలోకి అడుగుపెట్టిన ఆది కేశవ ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోటీన్‌ కథ, కథనాలు కావడంతో సినిమాకు మైనస్‌గా మారాయి. మరీ వయెలెన్స్‌ ఎక్కువైందని ట్రోల్స్‌ వచ్చాయి. అయితే వైష్ణవ్‌- శ్రీలీల జోడి యూత్‌ను బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి హుషారైన స్టెప్పులు ఆడియెన్స్‌ను అలరించాయి. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫైట్స్ సూపర్బ్‌గా ఉన్నాయంటూ ప్రశంసలు, రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఆదికేశవ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ వైష్ణవ్‌ తేజ్ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. అయితే క్రిస్మస్‌ పండగ కానుకగా ఆది కేశవను ఓటీటీలోకి తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకాస్త ముందుగానే ఓటీటీలోకి రానుందీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. డిసెంబర్‌ 22నే ఆదికేశవ ఓటీటీలోకి రానుంది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కింద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఆది కేశవ సినిమాలో సుమన్‌, రాధిక శరత్ కుమార్‌, సదా, అపర్ణా దాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవల థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో హిట్‌ అవుతున్నాయి. మరి ఆదికేశవ కూడా ఇదే జాబితాలో చేరుతుందో? లేదో? చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.