OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..

గురువారం కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రాగా.. ఇప్పుడు శుక్రవారం మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చేశాయి. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్, మిస్టరీ తరహా కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందామా..

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..
Mathu Vadalara 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 11, 2024 | 7:47 AM

ఓటీటీ సినీ ప్రియులకు రెండు రోజులు ముందుగానే దసరా పండగ స్టార్ట్ అయ్యింది. ఓవైపు థియేటర్లలో సూపర్ హిట్ మూవీస్ సందడి చేస్తుండగా.. మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరికొత్త కంటెంట్ వచ్చేసింది. గురువారం కొన్ని సినిమాలు ఓటీటీల్లోకి రాగా.. ఇప్పుడు శుక్రవారం మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చేశాయి. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్, మిస్టరీ తరహా కంటెంట్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందామా..

ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు..

మత్తు వదలరా 2.. ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ మత్తు వదలరా 2. గత నెల 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కాకుండానే ఈ శుక్రవారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చేసింది.

వాళై.. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా వాళై.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంలో వాళై అంటే అరటి పండు. పిల్లల డ్రామా సినిమా ఇది. 12 ఏళ్ల వయసున్న శివనందన్, అతని తల్లి, సోదరి, స్నేహితుడి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్త్రీ 2.. ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా స్త్రీ 2. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

శబరి.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి. ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఈ చిత్రం.

వెయ్ దరువెయ్.. థియేటర్లలో విడుదలైన ఏడు నెలల తర్వాత ఓటీటీలో వచ్చింది తెలుగు యాక్షన్ డ్రామా వెయ్ దరువెయ్. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సాయిరాం శంకర్, యశ్న హీరోహీరోయిన్లుగా నటించగా.. సునీల్, సత్యం రాజేశ్ కీలకపాత్రలు పోషించారు.

జై మహేంద్రన్.. మలయాళీ వెబ్ సిరీస్ జై మహేంద్రన్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. సైజు కురుప్ ఈ సిరీస్ లో కీలకపాత్రలో నటించాడు.

రాజ్ జవానీ హై.. హిందీ వెబ్ సిరీస్ రాజ్ జవానీ హై ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది.