The Nun 2: ఓటీటీలోకి వచ్చేసిన దెయ్యం సినిమా.. ‘ది నన్ 2’ స్ట్రీమింగ్ ఎక్కడవుతుందంటే..
ఈక్రమంలోనే ఇప్పుడు అడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అయ్యింది దెయ్యం. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టించేందుకు వచ్చేసింది. అదే ది నన్ 2. థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న ఈ హాలీవుడ్ హర్రర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 1956 ఫ్రాన్స్‌లో ఒక పూజారి దారుణంగా హత్యకు గురవుతాడు. అతడి మరణంపై తన సోదరి ఐరీన్ దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. కానీ ఆ సమయంలో ఒక శక్తివంతమైన దెయ్యంతో పోటిపడాల్సి వస్తుంది.
భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రాలకు అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి. మరోవైపు అటు ఓటీటీలోనూ సూపర్ హిట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఈక్రమంలోనే ఇప్పుడు అడియన్స్ ను భయపెట్టేందుకు రెడీ అయ్యింది దెయ్యం. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల వెన్నులో వణుకుపుట్టించేందుకు వచ్చేసింది. అదే ది నన్ 2. థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న ఈ హాలీవుడ్ హర్రర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 1956 ఫ్రాన్స్‌లో ఒక పూజారి దారుణంగా హత్యకు గురవుతాడు. అతడి మరణంపై తన సోదరి ఐరీన్ దర్యాప్తు చేయడం ప్రారంభిస్తుంది. కానీ ఆ సమయంలో ఒక శక్తివంతమైన దెయ్యంతో పోటిపడాల్సి వస్తుంది. 2018 చిత్రం ‘ది నన్’కి సీక్వెల్‌గా ది నన్ 2 సినిమాను రూపొందించారు. ది కంజురింగ్ యూనివర్స్ ఫ్రాంచైజీలో ఎనిమిదో విడత.
సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ హారర్ మూవీ చిత్రానికి మైకేల్ చేవ్స్ దర్శకత్వం వహించారు. ఇందులో సిస్టర్ ఇరేనే అనే ప్రధాన పాత్రలో టైస్సా ఫార్మి నటించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, హారర్ ఎలిమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విషాయల్లోనూ ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్ స్కైబర్స్ కు మాత్రమే రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా త్వరలోనే ఫ్రీగా చూసే ఛాన్స్ కల్పించనున్నారు.
confronting the unspeakable evil of 1956 france! 😶🌫️
The Nun 2 available on #PrimeVideoStore, rent now pic.twitter.com/Hbjon38cpT
— prime video IN (@PrimeVideoIN) October 19, 2023
వాస్తవానికి ఏదైనా విజయవంతమైన ఫ్రాంచైజీలలో ప్రస్తుతం ఫేమస్ అయిన ది నన్ 3 చిత్రాలతో ది నన్ సిరీస్ చిత్రాల భవిష్యత్తు గురించి ఎవరైనా ఆశ్చర్యపోతారు. మూడవ విడత ఉంటుందా అనేది ఇప్పటికీ మేకర్స్ వెల్లడించలేదు. కానీ డైరెక్టర్ మైఖేల్ చావ్స్ గతంలో ఓ ఇంటర్వ్యూలలో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ది నన్ 3, ది నన్ 2, ది కంజురింగ్ సంఘటనల మధ్య వారధిగా తెరకెక్కించే అవకాశం ఉందన్నారు.
— prime video IN (@PrimeVideoIN) October 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.