Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ సెకండ్ ఎపిసోడ్.. కంటస్టెంట్ లైఫ్ జర్నీకి కంటతడి పెట్టుకున్న నిత్యామీనన్..
ఇండియన్ ఐడల్ (Indian Idol).. ఈషోకు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఈషో ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తిచేసుకుంది.
ఇండియన్ ఐడల్ (Indian Idol).. ఈషోకు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో ఈషో ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ షో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha). తెలుగులో ఇప్పుడు ఈ షో రెండు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. మొదటి ఎపిసోడ్ మాదిరిగానే సెకండ్ ఎపిసోడ్ కూడా అద్భుతమైన సంగీతంతోపాటు..ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. జడ్జీలుగా వ్యవహరిస్తున్న తమన్, నిత్యా మీనన్, కార్తీక్.. తమ టైమింగ్ పంచులతో హోస్ట్ శ్రీరామచంద్రను ఉక్కిరి బిక్కిరి చేశారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. తమ మార్క్ పంచ్ డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. నిత్యా మీనన్, కార్తీక్ కంటెస్టెంట్స్‌ను జెన్యూన్‌గా కామెంట్స్ చేయడమే కాకుండా..ఎమోషనల్ టచ్ ఇచ్చారు.
సెకండ్ ఎపిసోడ్లో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల వైష్ణవి కడలి సినిమాలోని యాడికే.. పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైష్ణవి పాటపై తమన్ స్పందిస్తూ.. అద్భుతంగా పాడిందని.. ఈమె గురించి ఏఆర్ రెహమాన్‌కు తెలియజేస్తానని చెప్పారు. అంతేకాకుండా.. తనతో సాంగ్ కంపోజ్ చేయించాలని .. తానే స్వయంగా రెహమాన్‌ను రిక్వెస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. వైష్ణవి తర్వాత నెల్లూరుకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంట్రీ ఇచ్చారు. ముందుగా అక్క వైష్ణవి.. మహేష్ బాబు సినిమాలోని ఆవ్ తుజొ మోకార్తా సాంగ్ పాడి ఆకట్టుకుంది. ఆ తర్వాత చెల్లెలు వాగ్దేవి.. ఆచార్య సినిమాలోని లాహే లాహే పాటతో ప్రేక్షకులను మంత్రమూగ్దులను చేసింద. వాగ్దేవి వాయిస్ నచ్చడంతో తనను మణిశర్మకు రికమండ్ చేస్తానని హామీ ఇచ్చాడు తమన్.
ఇక ఆ తర్వాత.. కష్టాలతో పోరాటం చేస్తూ.. సింగర్ కావాలనే కలలు కంటున్న మారుతి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతను జీవనోపాధి కోసం హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్నానని.. అతన జీవితకథ చెప్పడంతో నిత్యామీనన్ ఎమోషనల్ అయ్యింది. మొత్తానికి తెలుగు ఇండియన్ ఐడిల్ సెకండ్ ఎపిసోడ్.. అద్భుతమైన సాంగ్స్, టైమింగ్ కామెడీ.. ఎమోషనల్ ఇలా అన్ని ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read: Prudhvi Raj: భీమ్లా నాయక్ సినిమాపై పృథ్వీ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ విషయంలో బాధగా ఉందంటూ..
Shruti Haasan: కరోనా బారిన పడ్డ హీరోయిన్.. ఆందోళనలో సలార్ చిత్రయూనిట్..
Chiranjeevi : గ్యాంగ్‌లీడర్ మార్క్ మసాలా ఎంటర్‌టైనర్‌తో రానున్న మెగాస్టార్..?