ఆయన్ను చెప్పుతో కొట్టాలి.. షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా.. కారణం ఇదే..
బిగ్‌బాస్ రియాలిటీ షో తో చాలా మంది పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పటికే ఈ షో ద్వారా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
బిగ్‌బాస్ రియాలిటీ షో తో చాలా మంది పాపులారిటీ దక్కించుకున్నారు. ఇప్పటికే ఈ షో ద్వారా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పటివరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీతో అలరించడానికి సిద్ధం అయ్యింది. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. బిగ్ బాస్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌పై సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ షో పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్ షో గేమ్ కాదని, లైసెన్స్ తీసుకున్న బ్రోతల్ హౌస్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నారాయణ.
తాజాగా ఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మండిపడ్డారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆమె బిగ్‌బాస్ షోను బ్రోతల్ హౌస్ అన్నందుకు నారాయణను చెప్పుతో కొట్టాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షో వల్ల తమకు ఎంతో గుర్తింపు, ఉపాధి కలుగుతున్నాయని ఆమె అన్నారు, ఒకవేళ షో నచ్చకపోతే ఛానెల్ మార్చుకోవాలి అంతే కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :