OTT Movie: ఆ 11 మంది ఎలా చనిపోయారు? దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
2018లో దేశాన్ని కుదిపేసిన ఓ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు మేకర్స్. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియల్ క్రైమ్ స్టోరీనే. మూఢనమ్మకాలు, చేతబడుల నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించారు. 2018లో దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడుతరాలకు చెందిన కుటుంబీకులు అంతా మూకుమ్మడిగా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటారు. మరి ఆ 11 మంది చావులకు కారణమేంటి? అసలు అవి ఆత్మహత్యలా? హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలకు ప్రేరేపించారా? అన్న నేపథ్యంలో ఈ సిరీస్ ఆద్యంత ఆసక్తికరంగా సాగుతుంది. పోలీసుల విచారణ ఎలా సాగింది? దర్యాప్తులో ఏం తేలింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఈ సిరీస్ పేరు ఆఖరి సచ్.రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు సౌరవ్ దేవ్ కథను అందించారు. నిర్వికార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఈ ఆఖరి సచ్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఆఖరి సచ్ వెబ్ సిరీస్ ట్రైలర్..
A bone chilling tale that unravels the most twisted ties of fate, trapped secrets of a family and terrifying horrors an investigator has ever seen. Watch #HotstarSpecials #AakhriSach from 25th August.#AakhriSachOnHotstar pic.twitter.com/8TQm0m503U
— JioHotstar (@JioHotstar) August 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








