మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మనై-4. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ సిరీస్ ‘అరణ్మనై ‘ నుంచి వచ్చిన 4వ చిత్రమిది. ఈసారి తెలుగులో కూా బాక్ పేరుతో విడుదల చేశారు. గత నెల మే 3న థియేటర్లలో రిలీజైన అరణ్మనై 4 హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాదదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. తెలుగులోనూ ఈ సినిమాకు గట్టిగానే ప్రమోషన్లు నిర్వహించారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ కూడా ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వంచి, భయ పెట్టిన అరణ్మనై-4 ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ హారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మేరకు జూన్ 21 నుంచి అరణ్మనై-4 చిత్రాన్ని స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. అలాగే సోషల్ మీడియా ద్వారా సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.
అరణ్మనై 4 చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నారు. డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమాలో కేజీఎఫ్ రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, వీటీవీ గణేశ్, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, ఫ్రెడ్రిక్ జాన్సన్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. హిప్‍హాప్ తమిజా సంగీతం అందించారు. ఇక ఇందులోని అచ్చో అచ్చచ్చో అనే ప్రమోషనల్ సాంగ్ యూబ్యూట్ లో సెన్సేషనల్ అవుతోంది. సంగీత ప్రియులను తెగ అలరిస్తూ యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతోంది.
Oru semma Family entertainer!
Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024
விரைவில் 🔥
Aranmanai 4 Coming Soon On Disney + Hotstar#Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/DsYnNrZ3d2
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 2, 2024
Code Word Accepted 😉
Aranmanai 4 Coming soon On Disney + Hotstar #Aranmanai4 #ComingSoon #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/a6iZnBNZv1
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.