AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stranger Things 5 OTT: ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్‌.. స్ట్రేంజర్‌ థింగ్స్‌ 5 స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

హాలీవుడ్‌ సినిమాలు, సిరీస్‌లు చూసే వారికి స్ట్రేంజర్‌ థింగ్స్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సీజన్స్‌ వచ్చాయి. చిత్ర విచిత్రమైన పవర్స్‌ తో మనుషులు చేసే విన్యాసాలు ప్రేక్షకులను అమితంగా అలరించాయి. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న స్ట్రేంజర్‌ థింగ్స్‌ సిరీస్‌కు త్వరలోనే శుభం కార్డు పడనుంది

Stranger Things 5 OTT: ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్‌.. స్ట్రేంజర్‌ థింగ్స్‌ 5 స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Stranger Things Season 5
Basha Shek
|

Updated on: Jan 07, 2024 | 3:47 PM

Share

హాలీవుడ్‌ సినిమాలు, సిరీస్‌లు చూసే వారికి స్ట్రేంజర్‌ థింగ్స్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సీజన్స్‌ వచ్చాయి. చిత్ర విచిత్రమైన పవర్స్‌ తో మనుషులు చేసే విన్యాసాలు ప్రేక్షకులను అమితంగా అలరించాయి. ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న స్ట్రేంజర్‌ థింగ్స్‌ సిరీస్‌కు త్వరలోనే శుభం కార్డు పడనుంది. ఈ సిరీస్ నుంచి ఆఖరి సీజన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ షూటింగ్‌ ప్రారంభమైనట్లు ఇటీవలమేకర్స్ తెలిపారు. 2023 జూన్‌లోనే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హాలీవుడ్‌లో అనూహ్యంగా తలెత్తిన సమ్మే కారణంగా ఈ సిరీస్‌ షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. దాదాపు ఏడు నెలలు ఆలస్యమైన స్ట్రేంజర్‌ థింగ్స్ ఆఖరి సీజన్‌ షూటింగ్‌ ఇటీవలే అట్లాంటాలో అధికారికంగా ప్రారంభమైంది. గత సీజన్లలో అలరించిన నటులే ఐదో సీజన్‌లోనూ కొనసాగుతారని మేకర్స్‌ తెలిపారు. అయితే మరిన్ని థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ తో స్ట్రేంజర్‌ థింగ్స్‌ సీజన్ 5 తెరకెక్కనుందని మేకర్స్‌ తెలిపారు. జో కీరీ (స్టీవ్), నటాలియా డయ్యర్ (నాన్సీ), మాయా హాక్ (రాబిన్), చార్లీ హీటన్ (జోనాథన్) సహా ప్రధాన తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వీలైనంత త్వరగా సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేశామని మేకర్స్‌ చెబుతున్నారు.

స్ట్రేంజర్ థింగ్స్ 5వ సీజన్‌ను నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది అంటే 2025 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే కచ్చితమైన రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ 2025లో తప్పుకుండా సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాగా ఇంతకు ముందు ఈ పాపులర్ సిరీస్ రిలీజ్ డేట్ విషయంలో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు సిరీస్‌ వస్తుందా? రాదా? అన్న సందేహాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు వాటన్నింటిని పటాపంచలు చేసింది. స్ట్రేంజర్ థింగ్స్ టీమ్‌. వచ్చే ఏడాదిలో నెట్‌ఫ్లిక్స్‌ లో రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

వచ్చే ఏడాదే స్ట్రీమింగ్..

అట్లాంటాలో షూటింగ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.