Swapna Chowdary: బిగ్‌బాస్‌లోకి పంపిస్తానని లక్షలు తీసుకున్నారు.. ఆధారాలతో వీడియో రిలీజ్‌ చేసిన యాంకర్‌

గ్రాండ్‌ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో ఎదుట కొందరు ఆకతాయిల అల్లర్లు చేయడం, బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసులు నమోదు కావడం, అరెస్ట్‌ కావడం, ఆ తర్వాత బెయిల్‌ రావడం.. ఇలా ముగిసిన తర్వాత కూడా బిగ్‌ బాస్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ పేరుతో మరొక చీటింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది

Swapna Chowdary: బిగ్‌బాస్‌లోకి పంపిస్తానని లక్షలు తీసుకున్నారు.. ఆధారాలతో వీడియో రిలీజ్‌ చేసిన యాంకర్‌
Anchor Swapna Chowdary
Follow us
Basha Shek

|

Updated on: Jan 07, 2024 | 3:12 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌ ముగిసిపోయింది. ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సెలబ్రిటీ గేమ్‌లో ఆడియెన్స్‌ను బాగానే ఎంటర్‌టైన్‌ చేసింది. అదే సమయంలో బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌లో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి.గ్రాండ్‌ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో ఎదుట కొందరు ఆకతాయిల అల్లర్లు చేయడం, బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసులు నమోదు కావడం, అరెస్ట్‌ కావడం, ఆ తర్వాత బెయిల్‌ రావడం.. ఇలా ముగిసిన తర్వాత కూడా బిగ్‌ బాస్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ పేరుతో మరొక చీటింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనను బిగ్‌ బాస్‌లోకి పంపిస్తామంటూ కొందరు డబ్బులు తీసుకున్నారని మోసం చేశారంటూ యాంకర్‌ స్వప్న చౌదరి ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలువురు స్టార్‌ సెలబ్రిటీలతోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. మిస్టరీ, నమస్తే సేట్‌ జీ అనే కొన్ని చిన్న సినిమాల్లోనూ నటించింది స్వప్న. బిగ్‌ బాస్‌ సీజన్ 1 ప్రారంభమైనప్పటి నుంచి ఈ సెలబ్రిటీ గేమ్‌షోకి వెళ్లాలనుకుంటోందట . ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోందట.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని ఒకరు రూ.2. 50 లక్షలు తీసుకున్నాడని ఒక వీడియో రిలీజ్‌ చేసింది స్వప్నా చౌదరి . ‘నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. నిద్రపోతున్న సమయంలోనూ బిగ్‌ బాస్‌లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూస్తున్నాను. బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 సమయంలోనూ నన్ను కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్‌లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బుతో ఫొటో షూట్‌ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు. ఆ సమయంలో నాకొక అగ్రిమెంట్‌ కూడా రాసిచ్చాడు. అయితే చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. బిగ్‌ బాస్‌కు పంపించలేకపోతే డిసెంబర్‌లో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాని సరిగా స్పందించడం లేదు. ఇప్పుడేమో కాల్‌ చేస్తే నీకు నచ్చింది చేసుకో.. కావాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్‌ ఇస్తున్నాడు. బిగ్‌ బాస్‌లోకి వెళదామన్న ఆశను అడియాశలు చేశాడు. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకున్నాడు. దయచేసి ఇలాంటివాళ్లను నమ్మి మోసపోకండి’ అని వీడియోలో చెప్పుకొచ్చింది స్వప్న.

ఇవి కూడా చదవండి

ప్రముఖ నటుడు అలీతో స్వప్నా చౌదరి..

బిగ్ బాస్ విన్నర్ సన్నీతో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!