Kakuda Movie OTT: ఆ గ్రామాన్ని వెంటాడుతోన్న దెయ్యం.. వణుకుపుట్టించే హారర్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా కాకుదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్

Kakuda Movie OTT: ఆ గ్రామాన్ని వెంటాడుతోన్న దెయ్యం.. వణుకుపుట్టించే హారర్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kakuda
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2024 | 2:34 PM

సాధారణంగా హారర్ మూవీస్ చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉంటుంది. కానీ ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. కానీ అదే హారర్ మూవీకి కామెడీ తోడైతే..ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అలాంటి కంటెంట్ తరహా చిత్రాలు తీసుకువచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, కామెడీ ఎంటర్టైనర్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఇప్పుడిప్పుడే హారర్ కామెడీ చిత్రాలు అడియన్స్ ముందుకు వస్తున్నాయి. అందులో కాకుదా ఒకటి. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా కాకుదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన ముంజ్యా సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ కాకుదా చిత్రానికి దర్శకత్వం వహించారు. ముంజ్యా మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. ఇప్పుడు కాకుదా సైతం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలోని రథోడీ అనే గ్రామం శాపగ్రస్తమైంది. ఆ ఊళ్లోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు కాకుదా అనే దెయ్యం వస్తుందని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఊళ్లో ఉన్న అన్ని ఇళ్లకు రెండు డోర్లు ఉంటాయి. ఒకటి పెద్దగా ఉండగా.. మరొకటి చిన్నది. ఆ చిన్న డోరును ఆ సమయానికి ప్రతి ఒక్కరూ తెరిచి ఉంచాలి. ఒకవేళ ఎవరైనా తెరచి ఉంచకపోతే 13 రోజుల్లో ఆ ఇంటి మనిషి పని అయిపోయినట్లే. అయితే ఆ చిన్న డోరును తెరిచి ఉంచకపోవడంతో సోనాక్షి భర్త ఆ దెయ్యానికి దొరికిపోతాడు. ఆ ఊరికి వచ్చిన దెయ్యాలను పట్టుకునే వ్యక్తి రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి దెయ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది సోనాక్షి. ఆ సమయంలో వారిద్దరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? సోనాక్షి భర్త ఏమయ్యాడు..? అసలు కాకుదా ద్యెయం ఎవరు ? అనే విషయాలు సినిమాలోనే చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.