AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prince OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. ప్రిన్స్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్రిన్స్ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో ఈనెల 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు హాట్‌స్టార్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Prince OTT: ఇట్స్‌ అఫిషియల్‌.. ప్రిన్స్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌
Prince Movie
Basha Shek
|

Updated on: Nov 17, 2022 | 6:12 AM

Share

కోలీవుడ్‌ హీరో శివ కార్తికేయన్‌ మొదటిసారి తెలుగులో నేరుగా నటించిన చిత్రం ప్రిన్స్‌. జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ తెరెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఉక్రెయిన్ బ్యూటీ మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుష్కర్ రామ్ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. అక్టోబర్‌ 21న తెలుగుతో పాటు తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. అయితే శివ కార్తికేయన్‌ నటన, మరియా అందాలతో పాటు అనుదీప్‌ టేకింగ్‌ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకున్న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్రిన్స్ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ పూర్తి కావడంతో ఈనెల 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు హాట్‌స్టార్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ సినిమాలో సత్యరాజ్, ప్రేమి అమరన్, సతీష్ కృష్ణన్, రాహుల్, ఆనందరాజ్ కీలక పాత్రలలో నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. హీరో శివకార్తికేయన్‌ ఓ స్కూలు టీచర్‌. అదే స్కూల్‌లోని ఇంగ్లిష్‌ టీచర్‌ మరియాను ప్రేమిస్తాడు. హీరో ఇండియన్‌ అబ్బాయి, హీరోయిన్‌ బ్రిటీష్‌ అమ్మాయి కావడంతో వీరి ప్రేమకు అడ్డంకులు వచ్చిపడతాయి. దీంతో ఈ ప్రేమ పోరాటం కాస్తా రెండు దేశాల మధ్య పోట్లాటగా మారుతుంది. మరి హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే అసలు కథ. అనుదీప్‌ శైలి కామెడీ పంచులతో ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోతుందీ సినిమా. మరి థియేటర్లలో ప్రిన్స్‌ వేషాలను చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే