Kantara OTT: ‘కాంతారా’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..
Kantara OTT Date: 'కాంతారా' ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వచ్చేసినట్లు ఉంది. విడుదల తేదీపై నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు.. అమెజాన్ ఈ విధంగా రిప్లయ్ ఇచ్చింది.
‘కాంతారా’.. కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై.. పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఒక్క భాషలోనే కాదు.. విడుదలైన అన్ని లాంగ్వేజ్‌స్‌లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడమే కాదు.. వసూళ్లు పరంగా ప్రభంజనం సృష్టించింది. థియేటర్లలో ఇంకా తన లాంగ్ రన్‌ను కొనసాగిస్తున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా.? అని ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఓ కీలక అప్‌డేట్ వచ్చేసింది. ‘కాంతారా’ ఓటీటీ తేదీపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. ‘Amazon Help’ ట్వీట్ రూపంలో సమాధానం ఇచ్చింది.
‘కాంతారా’ రిలీజ్ డేట్ చెప్పండి. ప్లీజ్.! అంటూ ఓ నెటిజన్ అమెజాన్ కస్టమర్ సర్వీస్‌కు ట్వీట్ చేయగా.. ”కాంతారా’ మూవీ స్ట్రీమింగ్ తేదీకి సంబంధించి మీ ఆత్రుత అర్ధం చేసుకున్నాం. ఈ టైటిల్‌తో ఉన్న సినిమా నవంబర్ 24, 2022 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది’. అని ‘Amazon Help’ రీ-ట్వీట్ ఇచ్చింది. అయితే కాసేపటికే ఆ ట్వీట్ అమెజాన్ డిలీట్ చేయడంతో.. స్ట్రీమింగ్ డేట్ మారుస్తారా.? అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం డిలీట్ చేశారా.? అనే దానిపై సందిగ్దత నెలకొంది. కాగా, రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాగా.. తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 360 కోట్లు పైగానే వసూళ్లు సాధించింది.’
We understand your concern regarding the streaming date of “Kantara”. Please be informed, the title will be available for streaming from Nov 24, 2022. – Sandeep
— Amazon Help (@AmazonHelp) November 17, 2022