Citadel: Honey Bunny: ‘సిటాడెల్’ టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సామ్.. స్ట్రీమింగ్ డేట్ఇదే

|

Aug 01, 2024 | 5:18 PM

ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను తెరకెక్కిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Citadel: Honey Bunny: సిటాడెల్ టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టిన సామ్.. స్ట్రీమింగ్ డేట్ఇదే
Citadel Honey Bunny Web Ser
Follow us on

ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న మరో వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను తెరకెక్కిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఇది ఇండియన్ వెర్షన్. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న సిటాడెల్ వెబ్ సిరీస్ పై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక అప్ డేట్ ఇచ్చింది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక ‘సిటాడెల్: హనీ బన్నీ’ టీజర్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి సమంత కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్ తో పాటు రొమాన్స్, సెంటిమెంట్ కూడా సరైన మోతాదులోనే దట్టించారు. హాలీవుడ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ తో సిటాడెల్ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా పెరిగాయి.

భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సిటాడెల్: హనీ బన్నీ’. వెబ్ సిరీస్ లో సికిందర్ ఖేర్, కేకే మీనన్, షకీబ్ సలీమ్, సిమ్రన్, సోహమ్ మజుందార్ కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు ఈ సిరీస్ కోసం సమంత స్పెషల్ గా మార్షల్‌ ఆర్ట్స్‌ లో ట్రైనింగ్ తీసుకుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

కాగా సమంతకు ఇది రెండో వెబ్ సిరీస్ కాగా వరుణ్ ధావన్ కు మాత్రం మొదటిది. సమంత క్రేజ్, మార్కెట్ దృష్ట్యా సిటాడెల్ సిరీస్ హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

సిటాడెల్ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.