Tiger 3 OTT: టైగర్‌ 3 ఓటీటీ రిలీజ్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్.. ఆ స్పెషల్‌ డే రోజున సల్మాన్‌ మూవీ స్ట్రీమింగ్‌

|

Dec 13, 2023 | 8:11 PM

దీపావళి కానుకగా నవంబర్‌ 12న థియేటర్లలోకి వచ్చిన టైగర్‌ పాజిటివ్‌ టాక్‌తో భారీ వసూళ్లు సాధించింది. షారుక్‌ ఖాన్, హృతిక్‌ రోషన్‌ వంటి స్టార్‌ హీరోల సైతం స్పెషల్ రోల్స్‌లో మెరవడంతో ఈ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించింది.

Tiger 3 OTT: టైగర్‌ 3 ఓటీటీ రిలీజ్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్.. ఆ స్పెషల్‌ డే రోజున సల్మాన్‌ మూవీ స్ట్రీమింగ్‌
Tiger 3 Movie
Follow us on

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన చిత్రం టైగర్‌ 3. ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై తర్వాత టైగర్‌ సిరీస్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. దీపావళి కానుకగా నవంబర్‌ 12న థియేటర్లలోకి వచ్చిన టైగర్‌ పాజిటివ్‌ టాక్‌తో భారీ వసూళ్లు సాధించింది. షారుక్‌ ఖాన్, హృతిక్‌ రోషన్‌ వంటి స్టార్‌ హీరోల సైతం స్పెషల్ రోల్స్‌లో మెరవడంతో ఈ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించింది. టైగర్‌ 3 మూవీ వరల్డ్‌ వైడ్‌గా సుమారు రూ. 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక గత కొన్నేళ్లుగా వరుసగా అపజయాలతో సతమతమైన సల్మాన్‌కు టైగర్‌ 3 రూపంలో మంచి సాలిడ్‌ హిట్‌ లభించింది. దీంతో సల్మాన్‌ ఖాన్‌ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్ వీడియో టైగర్‌ 3 మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేట్రిలక్‌ రిలీజై నెల పూర్తి కావడంతో డిసెంబర్‌ 12న ఈ బ్లాక్ బస్టర్‌ ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25 న టైగర్‌ 3 స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుందని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్‌ మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌ మారిందని తెలుస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్‌ 31న టైగర్‌ 3 సినిమా స్ట్రీమింగ్‌కు రానుందని సామాజిక మాధ్యమాల్లో టాక్‌ వినిపిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు వస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.

మనీష్‌ శర్మ తెరకెక్కించిన టైగర్‌ 3మూవీలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటించాడు. అలాగే సీనియర్‌ హీరోయిన్లు రేవతి, సిమ్రాన్‌ కీలక పాత్రల్లో మెరిశారు. రిద్ధి డోగ్రా, రణ్‌వీర్‌ షోరే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యశ్‍రాజ్ ఫిల్మ్స్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను నిర్మించారు. ప్రీతమ్‌ పాటలు సమకూర్చారు. ఎప్పటిలాగే టైగర్‌ 3లో యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు సల్మాన్‌ ఖాన్‌. అలాగే కత్రినా టవల్‌ ఫైట్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

న్యూ ఇయర్ స్పెషల్ గా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..