Live OTT: ఓటీటీలోకి మరో మలయాళ ఇంటెన్స్‌ థ్రిల్లర్‌.. ‘లైవ్‌’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 27, 2023 | 8:04 AM

మలయాళంలో రిలీజైన మరో ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీలో రానుంది. అదే లైవ్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, మమతా మోహన్‌దాస్‌, దసరా విలన్‌ షైన్ టామ్ చాకో, సౌబీన్ షాహిర్‌ కీలక పాత్రలు పోషించారు. సామాజిక మాధ్యమాల్లో వ‌చ్చిన ఫేక్ న్యూస్‌ కార‌ణంగా ఇబ్బందుల్లో..

Live OTT: ఓటీటీలోకి మరో మలయాళ ఇంటెన్స్‌ థ్రిల్లర్‌.. లైవ్‌ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Live Movie Ott
Follow us on

ఇటీవల ఓటీటీల్లో మలయాళ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా రియలిస్టిక్‌ కథనాలతో తెరకెక్కుతోన్న థ్రిల్లర్‌ మూవీస్‌ను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లను ఓటీటీ ఆడియెన్స్‌ ముందుకు తెస్తున్నాయి. అలా మలయాళంలో రిలీజైన మరో ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా ఓటీటీలో రానుంది. అదే లైవ్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, మమతా మోహన్‌దాస్‌, దసరా విలన్‌ షైన్ టామ్ చాకో, సౌబీన్ షాహిర్‌ కీలక పాత్రలు పోషించారు. సామాజిక మాధ్యమాల్లో వ‌చ్చిన ఫేక్ న్యూస్‌ కార‌ణంగా ఇబ్బందుల్లో పడ్డ ఇద్ద‌రు అమ్మాయిల క‌థ‌తో మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా లైవ్‌ రూపొందింది. వీకే సురేష్‌ దర్శకత్వం వహించారు. మే26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. అయితే సినిమాలోని థ్రిల్లింగ్‌ అంశాలు, ప్రియా ప్రకాష్‌ వారియర్‌, మమతల నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న లైవ్‌ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మ‌నోర‌మ మాక్స్ లైవ్‌ మూవీ డిజిటిల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

ఈక్రమంలో జూన్‌ 27 అర్ధరాత్రి నుంచే లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ లోనూ ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. కాగా గతంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన మమతా మోహన్‌ దాస్‌ మళ్లీ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. లైవ్‌ సినిమాతో పాటు రుద్రాంగి అనే మరో సినిమాలో ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..