Unstoppable 2- Prabhas: బాహుబలి రేంజ్ మాములుగా ఉండదు మరి.. సోషల్ మీడియాను షేక్ చేసిన ప్రభాస్ అన్‏స్టాపబుల్ ప్రోమో..

ఇక తాజాగా బాహుబలి స్టార్ ప్రభాస్..తన స్నేహితుడు హీరో గోపిచంద్ విచ్చేసి రచ్చ రచ్చ చేశారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో శనివారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్.

Unstoppable 2- Prabhas: బాహుబలి రేంజ్ మాములుగా ఉండదు మరి.. సోషల్ మీడియాను షేక్ చేసిన ప్రభాస్ అన్‏స్టాపబుల్ ప్రోమో..
Prabhas, Unstoppable 2
Follow us

|

Updated on: Dec 18, 2022 | 1:32 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జె్ట్ పాన్ ఇండియా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న డార్లింగ్.. మొదటి సారి ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేశారు. అది కూడా నందమూరి నటసింహం బాలకృష్ణతో కలిసి సరదాగా గడిపారు. ప్రముఖ ఓటీటీ మాద్యమం ఆహాలో బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా విచ్చేయగా.. వారి నుంచి ప్రేక్షకులకు కావాల్సిన విషయాలను రాబడుతున్నారు బాలయ్య. ఇక తాజాగా బాహుబలి స్టార్ ప్రభాస్..తన స్నేహితుడు హీరో గోపిచంద్ విచ్చేసి రచ్చ రచ్చ చేశారు. వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో శనివారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్.

ఆ ప్రోమోలో.. ప్రభాస్ కు సంబంధించిన సీక్రెట్స్ రివీల్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా డార్లింగ్ పెళ్లి..కాబోయే వధువు ఎవరో తెలుసుకోవడానికి తెగ ట్రై చేశారు బాలయ్యి. ఇక డార్లింగ్ సీక్రెట్స్ లీక్ చేయడంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోపిచంద్ హైలెట్ అయ్యారు. రాణి అంటూ ప్రభాస్ ను ఓ ఆటాడుకున్నారు. బయట ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే డార్లింగ్ అన్ స్టాపబుల్ షోలో ఎంతో సరదాగా.. అల్లరి అల్లరిగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నిన్న రిలీజ్ చేసిన ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ ప్రోమో విడుదలైన గంటలోనే దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చినట్లుగా మేకర్స్ తెలియజేశారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి గోపిచంద్.. ప్రభాస్ ను టీజ్ చేయడం ప్రోమోలోనే హైలెట్. ఇక వీరికి సంబంధించిన ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూయర్ కానుకగా డిసెంబర్ 30న ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.

గోపిచంద్, ప్రభాస్ స్నేహం వర్షం సినిమాతో మొదలైంది. డార్లింగ్ కెరీర్ లోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో వర్షం ఒకటి. ఇందులో త్రిష కథానాయికగా కనిపించగా.. గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రస్తుతం ప్రభాస్.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.