
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ఓజీ. డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుజీత్ డైరెక్షన్, పవన్ యాక్షన్.. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హాష్మీ విలన్ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేయగా.. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు థియేట్రికల్ రన్ కంప్లీట్ కావడంతో ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 23 నుంచి ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. దీంతో ఓజీ రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఓవైపు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు పవన్. ఇటీవలే హరి హార వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన పవన్.. చాలా కాలం తర్వాత ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Padella kritham bombay lo ochina thoofanu.. malli thirigi osthunnadu! 🌪️ pic.twitter.com/V61twCD3vu
— Netflix India South (@Netflix_INSouth) October 18, 2025
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..