Committee Kurrollu OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?

ఆగస్టు 09న థియేటర్లలో రిలీజైన కమిటీ కుర్రోళ్లు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పల్లెటూరిలో జరిగే ఓ జాతర, ఎన్నికలను నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా 1990ల జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చింది. అలాగే స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లెల వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడం జనాలను బాగా ఆకట్టుకుంది. లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఓవరాల్ గా రూ. 17 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.

Committee Kurrollu OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?
Committee Kurrollu Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 11, 2024 | 12:28 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్లు. యదు వంశీ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో ఏకంగా 11 మంది కొత్త హీరోలు, నలుగురు కొత్త హీరోయిన్లు నటించడం విశేషం. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తో రిలీజుకు ముందే కమిటీ కుర్రోళ్లు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. నిర్మాత నిహారిక దగ్గరుండి మరీ ప్రమోషన్లు గట్టిగానే నిర్వహించింది. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 09న థియేటర్లలో రిలీజైన కమిటీ కుర్రోళ్లు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పల్లెటూరిలో జరిగే ఓ జాతర, ఎన్నికలను నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా 1990ల జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చింది. అలాగే స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లెల వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించడం జనాలను బాగా ఆకట్టుకుంది. లో బడ్జెట్ మూవీగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఓవరాల్ గా రూ. 17 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని తదితరులు ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలున్న కమిటీ కుర్రోళ్లు సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 12 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందట.

కమిటీ కుర్రోళ్లు సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వి రావ్, విశిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయండి. ఎంచెక్కా ఈటీవీ విన్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్…

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..

కమిటీ కుర్రోళ్లు ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.