Netflix Price Drop: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. 30 దేశాల్లో భారీగా తగ్గిన ఛార్జెస్.. వివరాలివే..

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన OTT లలో అత్యంత ఖరీదైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్ ఫ్లిక్స్. Amazon Prime, Sony Live, Disney Plus Hotstar, G5, ఇతర OTT లతో పోలిస్తే.. Netflix మాత్రమే భారీగా..

Netflix Price Drop: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. 30 దేశాల్లో భారీగా తగ్గిన ఛార్జెస్.. వివరాలివే..
Netflix
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 25, 2023 | 6:11 PM

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన OTT లలో అత్యంత ఖరీదైన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్ ఫ్లిక్స్. Amazon Prime, Sony Live, Disney Plus Hotstar, G5, ఇతర OTT లతో పోలిస్తే.. Netflix మాత్రమే భారీగా ఛార్జెస్ వసూలు చేస్తుంది. అదే దాని కొంప ముంచుతుంది కూడా. దీని ఫీజుల కారణంగానే.. ఇటీవల సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. దెబ్బకు తేరుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఫీజులను తగ్గించింది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సేవలు అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. తాజాగా 30 దేశాల్లో నెలవారీ చార్జెస్‌ని తగ్గించింది. ఫీజు తగ్గింపుతో పాటు, పాస్‌వర్డ్ షేరింగ్, ప్రొఫైల్ షేరింగ్ విధానాల్లో కూడా కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్.. ఈజిప్ట్, ఒమన్, జోర్డాన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, స్లోవేనియా, బల్గేరియా, ఈక్వెడార్, వెనిజులా, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, బోస్నియా, మాసిడోనియా తదితర దేశాల్లో నెలవారీ రుసుమును తగ్గించింది. అయితే భారత్‌ ఈ జాబితాలో లేదు. నెట్‌ఫ్లిక్స్ గత ఏడాదే భారతదేశంలో నెలవారీ రుసుమును తగ్గించినందున, ఇప్పుడు మళ్ళీ తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తోంది.

కొన్ని దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ పాత ఛార్జెస్‌ని 50% తగ్గించింది. మరికొన్ని దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్ రూల్స్‌లో స్వల్ప మార్పు చేసింది. కెనడా, లాటిన్ అమెరికా, స్పెయిన్, న్యూజిలాండ్, పోర్చుగల్ దేశాలు పాస్‌వర్డ్ షేరింగ్ పరిమితిని పెంచాయి. అలాగే ఈ దేశాల్లో ఛార్జెస్ కూడా పెంచింది నెట్‌ఫ్లిక్స్.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో ఇంతకుముందు, నలుగురు వ్యక్తుల పరిమితితో HD ప్రీమియం ప్లాన్‌కు నెలవారీ రుసుము రూ.799 గా నిర్ణయించింది. అయితే, దేశంలో సబ్‌స్క్రైబర్లు తగ్గిపోతుండటంతో.. గతేడాది ఈ మొత్తాన్ని రూ.649కి తగ్గించింది. ఇక నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో కంటే పాకిస్తాన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. టర్కీ ప్రజలకు నెట్‌ఫ్లిక్కస్ ధరలు చాలా తక్కువకే అందుబాటులో ఉన్నాయి. సింగపూర్, అమెరికాలో భారీగా ఫీజులను వసూలు చేస్తుంది. అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందడానికి నెలకు 19.99 డాలర్లు చెల్లించాలి, ఇది భారతీయ కరెన్సీలో రూ. 1657.

గత త్రైమాసికంలో.. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య బాగా పడిపోయింది. నెట్‌ఫ్లిక్స్ అనేక దేశాలలో 50% కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అందుకే చాలా దేశాల్లో ఫీజులు తగ్గుతున్నాయి. ఇప్పుడు 30 దేశాల్లో ఛార్జీలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. రానున్న రోజుల్లో మరో 100 దేశాల్లో ఛార్జీలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..