Aha OTT: ఆహాలో సరికొత్త బిజినెస్ రియాల్టీ షో.. మహిళా వ్యాపారవేత్తలకు మరింత భరోసా..

|

Jun 27, 2023 | 7:10 PM

స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేస్తూ మహిళలను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేసేందుకు సరికొత్తగా బిజినెస్ రియాల్టీ షోను ప్రారంభించింది. అదే నేను సూపర్ ఉమెన్. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేలా మహిళలను ప్రోత్సాహించడమే ఈ రియాలిటీ షో ప్ర‌ధాన లక్ష్యం. దీంతో పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు.. వారిలో ఆర్థిక స్వాతంత్ర భావనను పెంపొందించనుంది.

Aha OTT: ఆహాలో సరికొత్త బిజినెస్ రియాల్టీ షో.. మహిళా వ్యాపారవేత్తలకు మరింత భరోసా..
Nenu Super Woman
Follow us on

డిజిటల్ రంగంలో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ఆహా. ఇప్పటివరకు సూపర్ హిట్ మూవీస్.. వెబ్ సిరీస్.. షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయ్యింది. స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేస్తూ మహిళలను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేసేందుకు సరికొత్తగా బిజినెస్ రియాల్టీ షోను ప్రారంభించింది. అదే నేను సూపర్ ఉమెన్. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేలా మహిళలను ప్రోత్సాహించడమే ఈ రియాలిటీ షో ప్ర‌ధాన లక్ష్యం. దీంతో పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతోపాటు.. వారిలో ఆర్థిక స్వాతంత్ర భావనను పెంపొందించనుంది.

ఆహా తీసుకువస్తున్న ఈ సరికొత్త బిజినెస్ రియాల్టీ షోకు సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏజెంల్స్ అనే ప్యానెల్‌ ఉంటుంది. ఇందులో పాల్గొనే మ‌హిళా వ్యాపారులు వారి ఆలోచ‌న‌ల‌ను తెలియ‌చేయ‌వ‌చ్చు. అలాగే కంటెస్టెంట్స్‌కు శ్రీరామ చంద్ర తగిన రీతిలో మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేయనున్నారు. ఇక ఈ రియాల్టీ షో కోసం ప్రస్తుతం 40 మంది అసాధార‌ణ అభ్య‌ర్థులు ఎంపికయ్యారు. వీరంతా అందరి సమక్షంలో తమ ఆలోచ‌న‌ల‌ను ముఖాముఖిగా తెలియజేయనున్నారు. ఇక ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయబడుతుంది. తుది ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత ప్యానెల్ ఆఫ‌ర్స్‌ను పొడిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఏంజెల్స్ ప్యానెల్లో రోహిత్ చెన్న‌మ‌నేని (డార్విన్ బాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు), శ్రీధ‌ర్ గాది (క్వాంటెలా ఇన్క్ యొక్క వ్య‌వ‌స్థాప‌కుడు మ‌రియు ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌), రేణుకా బొడ్లా (సిల్వ‌ర్ నీడెల్ వెంచ‌ర్స్ భాగ‌స్వామి), సుధాక‌ర్ రెడ్డి (అభి బ‌స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఇఓ), దొడ్ల దీపా రెడ్డి (దొడ్ల డెయిరీ), సింధూర పొంగూరు (నారాయ‌ణ గ్రూప్‌) ఉన్నారు. వీరంద‌రూ త‌మ రంగాల్లో ఎంతో నైపుణ్యం సాధించిన నిష్ణాతులు కావడం విశేషం. ఇక వీరంతా వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి, విభిన్న నేప‌థ్యాలున్న మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్త‌లుగా ప్రోత్స‌హించ‌టానికి సిద్ధంగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.