Nayattu OTT: ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. చుండూరు పోలీస్ స్టేషన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ప్రస్తుతం మలయాళ సినిమాల క్రేజ్ నడుస్తోంది. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ మాలీవుడ్ మూవీస్ దే హవా. మరీ ముఖ్యంగా ఓటీటీలో అయితే ఈ మలయాళ సినిమాలకు భారీగా ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో సుమారు మూడేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన ఓ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు

Nayattu OTT: ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. చుండూరు పోలీస్ స్టేషన్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Nayattu Movie
Follow us

|

Updated on: Apr 23, 2024 | 4:33 PM

ప్రస్తుతం మలయాళ సినిమాల క్రేజ్ నడుస్తోంది. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ మాలీవుడ్ మూవీస్ దే హవా. మరీ ముఖ్యంగా ఓటీటీలో అయితే ఈ మలయాళ సినిమాలకు భారీగా ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో సుమారు మూడేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన ఓ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదే నాయట్టు. 2021 ఏప్రిల్ 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ట్రేడ్ నిపుణులను ఆశ్చర్య పరుస్తూ భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోనూ ట్రెండింగ్ లో నిలిచింది. భారీ వ్యూస్ రాబట్టింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులో లేకపోవడంతో తెలుగు సినీ ప్రేక్షకులు కాస్త డిజప్పాయింట్ కు లోనయ్యారు. ఇప్పుడు వారిని అలరించేందుకు నాయట్టు తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రానుంది. చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘పోలీస్ వెంట పోలీస్ పడితే..వస్తోంది ‘చుండూరు పోలీస్ స్టేషన్’ మీ ఆహాలో’ అంటూ సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

నాయట్టు సినిమాలో వర్సటైల్ యాక్టర్ కుంచకో బోబన్‌, ఆది కేశవ విలన్ జోజూ జార్జ్‌, సూపర్ హిట్ వెబ్ సిరీస్ పోచర్ ఫేమ్ నిమేషా సజయన్‌ కీలక పాత్రల్లో నటించారు. మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వం వహించారు. రంజిత్, పీఎం శశధరన్ తో కలిసి నిర్మించిన ‘చుండూరు పోలీస్ స్టేషన్’కు విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఒక పోలీస్ వెంట మరొక పోలీస్ పడితే… లాకప్ డెత్ తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కానిస్టేబుల్ ను పట్టుకోవడానికి మరొక పోలీస్ ప్రయత్నిస్తే ఏం జరిగింది? అనేది నాయట్టు సినిమాకథ. కాగా ఇదే సినిమాను కోట బొమ్మాళి పీఎస్ పేరుతో తెలుగులో కూడా రీమేక్ చేశారు. శ్రీకాంత్, శివానీ రాజ శేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది రిలీజైన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

26 నుంచి ఆహాలో అందుబాటులోకి..

.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?