AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: మీకు హార్రర్ సినిమాలంటే ఇష్టమా ?.. కానీ ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..

నెట్ ఫ్లిక్స్ లో 2020లో విడుదలైన 4-ఎపిసోడ్ హారర్ థ్రిల్లర్ సిరీస్ Betaal (Betaal) ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా మంచి థ్రిల్లింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ సిరీస్‌ను షారుక్ ఖాన్-గౌరీ ఖాన్‌ల సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. గత కొన్ని సంవత్సరాలుగా, పౌరాణిక కథల స్ఫూర్తితో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కిస్తున్నారు. పెడల్ అనే సిరీస్ ఇలాంటి కథతో స్ఫూర్తి పొందిందని అంటుంటారు.

OTT Movies: మీకు హార్రర్ సినిమాలంటే ఇష్టమా ?.. కానీ ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
Betaal Series
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2024 | 11:46 AM

Share

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏కు ఆదరణ పెరిగిపోయింది. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ కంటే ఎక్కువగా హార్రర్ కంటెంట్ చూసేందుకు మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ లో 2020లో విడుదలైన 4-ఎపిసోడ్ హారర్ థ్రిల్లర్ సిరీస్ Betaal (Betaal) ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా మంచి థ్రిల్లింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఈ సిరీస్‌ను షారుక్ ఖాన్-గౌరీ ఖాన్‌ల సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. గత కొన్ని సంవత్సరాలుగా, పౌరాణిక కథల స్ఫూర్తితో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కిస్తున్నారు. పెడల్ అనే సిరీస్ ఇలాంటి కథతో స్ఫూర్తి పొందిందని అంటుంటారు.

ఈ సిరీస్ విషయానికి వస్తే.. ఒక గిరిజనుడు గుడిలో పూజలు చేయడంతో ప్రారంభమవుతుంది. ఇందులో కొంతమంది అమ్మాయిలు దెయ్యాలతో మాట్లాడతుంటారు. మరోవైపు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సొరంగాన్ని తెరవాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ ఆ సొరంగం తెరవడాన్ని దేవుడు ఎప్పుడూ ఆపుతున్నాడని ఆ గ్రామంలోని మహిళ చెబుతుంది. మరోవైపు ఈ సొరంగాన్ని తెరచి దాని గుండా జాతీయ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ అక్కడే ఉన్న గ్రామస్తులు సొరంగాన్ని పగలగొట్టకూడదని ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారు.

ప్రభుత్వం పంపిన దళాలు గ్రామస్తులను అక్కడి నుంచి చెదరగొట్టేస్తారు. ఇక అప్పుడే అసలైన హర్రర్ గేమ్ ప్రారంభమవుతుంది. ఆ సొరంగాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక శక్తివంతమైన బ్రిటీష్ సైన్యం సొరంగాల నుండి బయటపడటం ప్రారంభమవుతుంది. దీంతో అప్పటి నుంచే దెయ్యాలతో అసలైన యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ క్లైమాక్స్ చాలా భయంకరంగా తెరకెక్కించారు. క్రూరమైన మనుషులుగా కనిప్సూత రక్తంతో నిండిన ముఖాలు ఉన్నవారు బయటకు వస్తారు. వారి శరీరాలపై కాలిన గాయాలున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భయంకరంగా ఉంటుంది. కేవలం 4 ఎపిసోడ్‌లు మాత్రమే ఉన్నం ఈ సిరీస్‌ని చూడాలంటే ధైర్యం కావాలి అంటున్నారు నెటిజన్స్. ఈ సిరీస్‌ని Netflixలో చూడవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.