AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda in OTT: బాలయ్య స్పీడుకు బ్రేకుల్లేవ్.. ఓటీటీలోకి అఖండ.. విడుదలయ్యేది ఎప్పుడంటే..

Akhanda in OTT: నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ అఖండ.. బాక్సాఫీస్ వద్ద  సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య, బోయపాటి కాంబోలో...

Akhanda in OTT: బాలయ్య స్పీడుకు బ్రేకుల్లేవ్.. ఓటీటీలోకి అఖండ.. విడుదలయ్యేది ఎప్పుడంటే..
Akhanda
Surya Kala
|

Updated on: Dec 08, 2021 | 2:44 PM

Share

Akhanda in OTT: నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ అఖండ.. బాక్సాఫీస్ వద్ద  సూపర్ హిట్ అందుకుంది. బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. కరోనా భయాలను దాటి చిత్ర పరిశ్రమకు ఊపింది అందించేలా ‘అఖండ’ సినిమా అఖండ విజయంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం పారుతోంది. ఈ సినిమాతో బోయపాటి – బాలయ్య కాంబోలో హాట్రిక్ హిట్ పడటంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అఖండ’ మూవీ గురించిన మరో క్రేజీ అప్‌డేట్ వైరల్‌గా మారింది.

అన్నివర్గాల ఆడియన్స్‌ను మెప్పించి, ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘అఖండ’ త్వరలోనే ఓటీటీలో ప్రసారం కాబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌ బస్టర్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఓటీటీలో విడుదల చేసి నందమూరి ఫ్యాన్స్ చేత ఇక ఇంట్లోనే గోలపెట్టించాలని ప్లాన్‌ చేశారట దర్శకనిర్మాతలు. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని టాక్. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తున్న అఖండ మూవీ కేవలం 6 రోజుల్లోనే 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. వెండితెరపై బాలయ్య మాస్ అప్పీరెన్స్, అఘోరాగా ఉగ్రరూపం చూసి ఫ్యాన్స్‌ హుషారెత్తిపోతున్నారు.ఈ సినిమాలో థియేటర్లకు మళ్ళీ మంచి రోజులు వచ్చేశాయని అంటున్నారు.

Also Read:

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

మాస్క్ లేకుంటే అంతే.. ఆదేశాలు జారీ చేసిన దక్షిణమధ్య రైల్వే..