
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది తండేల్. అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ తిరగరాసింది. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ చేరుకుంది. చైతూ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. మత్య్సకారుల బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా రియల్ స్టోరీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా చైతూ, సాయి పల్లవి కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. చైతూ యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా తండేల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్.. మార్చి 7 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. అలాగే తండేల్ పోస్టర్ సైతం రిలీజ్ చేసింది. దీంతో ఇప్పుడు చైతూ, సాయి పల్లవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కథ విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లతో గుజరాత్ వెరావల్ నుంచి బయలదేరి చేపల వేట సాగిస్తుండగా.. పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి వెళ్తారు. దీంతో వారిని పాక్ అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. అదే తండేల్ కథ. మత్య్సకారులను పాక్ ఎలా విడుదల చేసింది.. ? రాజు, సత్య ప్రేమకథ గురించి తెలుసుకోవాలంటే తండేల్ చూడాల్సిందే.
Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️
Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..