AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 రోజుల్లోనే షూటింగ్ మృణాల్ ఠాకూర్ పూర్తి.. ఆ ఓటీటీలో అందుబాటులో

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని సింగిల్ షెడ్యూల్‌లో కేవ‌లం ప‌ది రోజుల్లోనే కంప్లీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 2021లో రిలీజైన ఈ బాలీవుడ్ మూవీలో కార్తిక్ ఆర్యన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. 2020 డిసెంబ‌ర్ 14న ఈ మూవీ షూటింగ్ మొద‌లైంది. డిసెంబ‌ర్ 24వ రోజు షూటింగ్ కంప్లీట్ అయిన‌ట్లు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

10 రోజుల్లోనే షూటింగ్ మృణాల్ ఠాకూర్ పూర్తి.. ఆ ఓటీటీలో అందుబాటులో
Mrunal Thakur
Ram Naramaneni
|

Updated on: Feb 12, 2024 | 2:04 PM

Share

ఓ సినిమా తీయడమంటే మాములు విషయం కాదు. ప్రజంట్ సినిమా స్పాన్, క్వాలిటీ పెరగడంతో.. షూటింగ్‌కు కూడా చాలా సమయం పడుతోంది. అంతేకాదు నటీనటుల కాంబినేషన్స్ కుదరాలి.. 24 క్రాఫ్ట్స్ ప్రణాళికతో వర్క్ చేయాలి. ఇక మన రాజమౌళి లాంటి డైరెక్టర్స్ అయితే సినిమాను క్వాలిటీగా చెక్కేందుకు ఏళ్ల తరబడి తీసుకుంటారు. పూరి జగన్నాథ్, ఆర్జీవీ లాంటి డైరెక్టర్స్.. ఫాస్ట్‌గా షూటింగ్ చేసి.. రెండు నెలల్లో సినిమాని చుట్టేస్తారు. ఇక యాక్షన్ సినిమాలు అయితే ఇంకా ఎక్కువ టైమ్ తీసుకుంటాయి. కానీ ఓ బాలీవుడ్ సినిమా 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాని కంప్లీట్ చేశారట. ఇందులో కార్తిక్ ఆర్య‌న్‌, మృణాల్ ఠాకూర్ లాంటి అగ్ర తారలే నటించారు. ఆ సినిమా పేరు ధమాకా.

 2021లో రిలీజైందీ మూవీ. 2020 డిసెంబ‌ర్ 14న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారట. డిసెంబ‌ర్ 24న షూటింగ్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని హీరో కార్తిక్ ఆర్యన్ కూడా ఓ సందర్భంలో వెల్లడించాడు. డైరెక్టర్ 10 రోజుల్లోనే సినిమా తీయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వివరించాడు.

 ఈ మూవీ షూటింగ్ మొత్తం 90 శాతం ముంబైలోని ఓ ఫైవ్‌ స్టార్ హోట‌ల్‌లోనే జరిగిందట. ఆ సమయంలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టం వల్ల షూటింగ్ పూర్తి అయ్యేవరకు దాదాపు 300 మంది ఆర్టిస్టుల‌కు హోట‌ల్‌లోనే ఉండే ఏర్పాట్లు చేశారట. అయితే సినిమాలోని కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్​లను మాత్రం ఔట్​ డోర్‌లో షూట్ చేసినట్లు చెబతున్నారు. అది కేవలం ఒక్క‌రోజులోనే. కానీ షూటింగ్​కు మాత్రమే 10 రోజులు పట్టింది. పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​కు మాత్రం ఐదు నెలలు పట్టిందట. అయితే ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలో అతి త‌క్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలబడింది. ప్రజంట్ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us