AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valari Movie OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ సినిమా.. రితికా సింగ్ ‘వళరి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ఇప్పుడు ఓటీటీలోకి మరో హారర్ మూవీ రాబోతుంది. అదే 'వళరి'. గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రితికా సింగ్. ఇందులో వెంకీ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది. ఇక ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే రైటర్ మ్రితికా దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు.

Valari Movie OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ సినిమా.. రితికా సింగ్ 'వళరి' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Ritika Singh
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2024 | 6:35 AM

Share

అటు థియేటర్స్.. ఇటు ఓటీటీలో సినిమాల జాతర మొదలైంది. గత శుక్రవారం ఈగల్, లాల్ సినిమాలు విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు థియేటర్లలో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీస్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి మరో హారర్ మూవీ రాబోతుంది. అదే ‘వళరి’. గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రితికా సింగ్. ఇందులో వెంకీ సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది. ఇక ఇప్పుడు హారర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే రైటర్ మ్రితికా దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఉత్తేజ్, సుబ్బరాజు, నవీన్ నాయుడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఔట్ అంట్ ఔట్ హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే రితికా సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో రితికా సింగ్ వెనక దయ్యం రూపంలో మరో అమ్మాయి కనిపించడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

2018లో విడుదలైన నీవెవరో సినిమా తర్వాత రితికా మరో మూవీలో కనిపించలేదు..కానీ తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ వళరి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతోనే రితికా అటు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వళరిని తమిళనాడు ప్రజలు ఆయుధంగా ఉపయోగిస్తుంటారు. 1800 దశకంలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ ఆయుధాన్ని నిషేధించింది. ఆ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి ఏమీ లేకపోయినా మంచి గ్రేవీతో..
ఇంట్లో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి ఏమీ లేకపోయినా మంచి గ్రేవీతో..
బామ్మ కాలం నాటి రుచితో సేమియా కేసరి.. దీపావళి స్పెషల్ స్వీట్ ఇదే
బామ్మ కాలం నాటి రుచితో సేమియా కేసరి.. దీపావళి స్పెషల్ స్వీట్ ఇదే
పిల్లలు పండ్లు తినడం లేదా?ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఏబీసీ గమ్మీస్ తో..
పిల్లలు పండ్లు తినడం లేదా?ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఏబీసీ గమ్మీస్ తో..
ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్‌.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
ధంతేరస్ నాడు కుబేరుడిని ఎందుకు పూజిస్తారు? సంపదకు అధిపతి కావడం..
ధంతేరస్ నాడు కుబేరుడిని ఎందుకు పూజిస్తారు? సంపదకు అధిపతి కావడం..
కర్వాచౌత్‌లో చంద్రుడిలా మెరిసిపోవాలా? ఇంట్లోనే గోల్డెన్ గ్లో ఫేస్
కర్వాచౌత్‌లో చంద్రుడిలా మెరిసిపోవాలా? ఇంట్లోనే గోల్డెన్ గ్లో ఫేస్
ప్రోటీన్ నుంచి విటమిన్ బి12 వరకు.. పోషకాల పవర్‌హౌస్ మేక తలకాయ..
ప్రోటీన్ నుంచి విటమిన్ బి12 వరకు.. పోషకాల పవర్‌హౌస్ మేక తలకాయ..
రూ. 449 కోట్లకు అమ్ముడైన అరుదైన డైనోసార్ అస్థిపంజరం జోడి..స్పెషల్
రూ. 449 కోట్లకు అమ్ముడైన అరుదైన డైనోసార్ అస్థిపంజరం జోడి..స్పెషల్
జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును
జున్నుపాలు లేకుండా 15 నిమిషాల్లో చేసే గడ్డలాంటి జున్నును
దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది
దీపావళికి ఇంట్లో ఈ మొక్కలు నాటితే..లక్ష్మీదేవి పరుగెత్తుకవస్తుంది