Grrr OTT: సింహం బారి నుంచి ఎలా తప్పించుకున్నారు? ఓటీటీలో  మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

ప్రస్తుతం ఇండస్ట్రీలో మలయాళ సినిమాల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మాలీవుడ్ మూవీస్ అలరిస్తున్నాయి. ఇక ఓటీటీలో అయితే మలయాళ సినిమాలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా మలయాళ సినిమాలకు ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి

Grrr OTT: సింహం బారి నుంచి ఎలా తప్పించుకున్నారు? ఓటీటీలో  మలయాళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Grrr Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 15, 2024 | 8:01 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో మలయాళ సినిమాల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మాలీవుడ్ మూవీస్ అలరిస్తున్నాయి. ఇక ఓటీటీలో అయితే మలయాళ సినిమాలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు కూడా మలయాళ సినిమాలకు ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఒక సూపర్ హిట్ సినిమానే ఓటీటీలోకి వస్తోంది. అదే కుంచకో బోబన్‌, సూరజ్‌ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ‘గర్ర్‌’. సింహగర్జన శబ్దమే టైటిల్‍గా ఈ సర్వైవల్ కామెడీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 14న మలయాళంలో విడుదలైన గర్ర్‌ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సర్వైవల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ‘గర్ర్‌’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆగస్టు 20న ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ఆగస్టు 20 నుంచి నవ్వులతో గర్జించేందుకు రెడీగా ఉండండి. డిస్నీప్లస్ హాట్‍స్టార్‌లో గర్ర్ వస్తోంది’ అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ పోస్ట్ పెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ గర్ర్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

గర్ర్ చిత్రానికి జై కే దర్శకత్వం వహించారు. బోబన్, సూరజ్‍తో పాటు శృతి రామచంద్రన్, అనఘ, రాజేశ్ మాధవన్, మంజు పిళ్లై, శోభి తిలకన్, సెంథిల్ కృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఆగస్టు సినిమా పతాకంపై షాజీ నదేశన్, ఆర్య ఈ సినిమాను నిర్మించారు. డాన్ విన్సెంట్, కాళిదాస్ మీనన్, టోనీ టార్జ్ సంగీతం అందించారు. జయేశ్ నాయర్ సినిమాటోగ్రఫీ, వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. పొరపాటున జూలోని సింహం బోనులోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తప్పించుకోవడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

ఇవి కూడా చదవండి

డిస్నీప్లస్ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.