Purushothamudu OTT: అప్పుడే ఓటీటీలోకి రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం 'పురుషోత్తముడు'. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ కు చెందిన పలువురు సీనియర్ యాక్టర్లు ఈ మూవీలో నటించడం, రాజ్ తరుణ్- లావణ్యల వివాదం కారణంగా రిలీజ్ కు ముందే పురుషోత్తముడు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ కు చెందిన పలువురు సీనియర్ యాక్టర్లు ఈ మూవీలో నటించడం, రాజ్ తరుణ్- లావణ్యల వివాదం కారణంగా రిలీజ్ కు ముందే పురుషోత్తముడు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే జులై 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. చాలా మంది ఓటీటీలో ఈ సినిమాను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఇలా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని పురుషోత్తముడు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగస్ట్ 23 నుంచి పురుషోత్తముడు సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ వారంలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
డాక్టర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్ నిర్మించిన పురుషోత్తముడు సినిమాలో సీనియర్ నటీనటులు బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సత్యతో పాటు పలువురు కమెడియన్లు నటించారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను పీజీ విందా నిర్వర్తిం చగా, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేశ్ వ్యవహరించారు. కాగా పురుషోత్తముడు సినిమా కాన్సెప్టుతో గతంలో మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా వచ్చింది. ఇదే సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో పురుషోత్తముడు సినిమా రాజ్ తరుణ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇవ్వలేకపోయింది.
పురుషోత్తముడు సినిమాలో రాజ్ తరుణ్..
This one’s a complete package of entertainment that you’ll be looking for :)🤗
Hope you like it!#PurushothamuduTeaser ▶️ https://t.co/DX8cR0xuW1#Purushothamudu pic.twitter.com/NZuGQ4pnOX
— Raj Tarun (@itsRajTarun) May 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.