Marco OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

ఇన్నాళ్లు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ అడియన్స్ నుందుకు వచ్చింది. గతేడాది బాక్సాఫీస్ వద్ద రూ.115 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

Marco OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
Marco Movie

Updated on: Feb 13, 2025 | 7:04 PM

గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ అయి బ్లాక్ బ్సటర్ హిట్ గా నిలిచింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.115 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో సిద్ధిఖీ, జగదీష్, అభిమన్యులాంటి హీరోలు సైతం నటించారు. ఈ చిత్రంలో వయోలెన్స్ మరీ ఎక్కువగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి. ప్రతి క్షణం ఒళ్లుగగుర్బోడిచే సీన్లతో వణుకుపుట్టించేలా తెరకెక్కించారు హనీఫ్ అదేనీ.

యాక్షన్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. థియేటర్లలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.

ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే గురువారం అర్దరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ ఆకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నాం నుంచి మార్కో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన