ఏముంది మావ ఈ సినిమాలో.. గూగుల్‌లో తెగ గాలిస్తున్నారట ఈ మూవీ కోసం..
థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో కూడా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదలై మెప్పించాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఓ సినిమా కోసం జనాలు గూగుల్ లో తెగ గాలిస్తున్నారు.

ఓటీటీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు చేశారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్న సమయంలో ఓటీటీలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. ఇక ఒక సినిమా నచ్చిందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఓ సినిమా కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించారట. గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీ ఇదేనట. ఇంతకూ ఆ సినిమా ఏంటి.? ఆ సినిమాలో అంతగా కథ ఏంటి.?
ఓటీటీలో ఆకట్టుకుంటున్న సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్స్, థ్రిల్లర్స్, హారర్ జానర్ సినిమాలే కాదు.. ఫ్యామిలీ డ్రామాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఓ ఫ్యామిలీ డ్రామా గురించి నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించారట. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే.. ఆ సినిమా పేరే మిసెస్. ఈ సినిమా మలయాళ మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకు రీమేక్. ఈ రీమేక్ ను హిందీలో తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ లు బ్రేక్ చేస్తుంది. నెటిజన్స్ ఈ సినిమా కోసం తెగ సర్చ్ చేస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాలో సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించింది. దంగల్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది సాన్యా మల్హోత్రా. ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ విషయాన్నీ జీ 5 సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రికార్డులు బ్రేకవుతున్నాయి. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎవర్ అంటూ జీ5 పోస్ట్ చేసింది. అంతే కాదు గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా అని కూడా తెలిపింది. సాన్యా మల్హోత్రాతోపాటు నిషాంత్ దహియా, కన్వల్జీత్ సింగ్ నటించారు. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి