OTT Movie: మరదలిపై కన్ను.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు పడేసే భార్య.. ఈ క్రైమ్ థ్రిల్లర్ వేరే లెవెల్
వివాహేతర సంబంధాలు ఎలాంటి అనర్థాలకు దారి తీస్తాయో ఇటీవల కాలంలో మనం బాగా చూసే ఉంటాం. హనీ మూన్ మర్డర్ కేసు, అలాగే హైదరాబాద్ లోని మీర్ పేటలో భార్యను చంపి కుక్కర్ లో ఉడికించిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటేనే ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది.

వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి. ప్రియుడు సహాయంతో భార్య భర్తను హతమార్చడం, ప్రియురాలి హెల్ప్ తో భర్త భార్యను చంపడం లాంటి ఘటనలు ఇటీవల బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక మేఘాలయ హనీ మూన్ మర్డర్ కేసు, మీర్ పేట మర్డర్ కేసులైతే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇలాంటి వివాహేతర సంబంధాల అనర్థాలపై గతంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లువచ్చాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం వేరే లెవెల్. ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. దీంతో నెక్ట్స్ ఏం జరుగుందో తెలియక ప్రేక్షకుడు తల తిప్పుకోకుండా సినిమాలో లీనమైపోయాడు. థియటర్లలో ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రారంభంలో కాస్త సాగదీత సన్నివేశాలతో స్ అనిపించానా మధ్యలో సినిమా పరుగులు పెడుతుంది. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. ఈ సినిమా కథ చెన్నై నేపథ్యంలో సాగుతుంది.. అరవింద్, పూర్ణిలకు కొత్తగా పెళ్లవుతుంది. ఇద్దరూ కలిసి చెన్నైలో కాపుర పెడతారు. మొదట్లో వీరి అన్యోన్యత చూసి ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాం. భర్త కూడా చాలా మంచోడు అనుకుంటాం. కానీ రాను రాను అతను పూర్తిగా మారిపోతాడు. భార్యపై పూర్తి ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతాడు. భార్యను కేవలం వంటింటి కుందేలుగా మారుస్తాడు.
అయితే అరవింద్‌కు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందన్న నిజం పూరీకి తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె మౌనంగానే భరిస్తుంది. ఒక రోజు పూర్ణి చెల్లెలు వరుసయ్యే అమ్మాయి ఇంటికి వస్తుంది. ఆమెను ఒంటరిగా వదలి పెట్టి పూరీ బయటకు వెళుతుంది. ఇదే అదనుగా భావించిన అరవింద్ తన భార్య చెల్లెలిపై కన్నేస్తాడు. ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రమాదవశాత్తూ కిందకు పడిపోతాడు. దీంతో తలకు తీవ్ర గాయమవుతుంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన పూరీ ఇదంతా చూసి నిర్ఘాంత పోతుంది. అప్పటికే తన భర్త నిజ స్వరూపం తెలుసుకున్న ఆమె కొన ఊపిరితో ఉన్న తన భర్తను చంపేస్తుంది.
మరి పూర్ణి తన భర్త శవాన్ని ఏం చేసింది? పోలీసులకు దొరకాకుండా ఎలా తప్పించుకుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాపేరు జెంటిల్ వుమన్. జై భీమ్ మూవీ ఫేమ్ లిజోమోల్ జోస్, లోస్లియా మరియనేసన్, హరికృష్ణన్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీ, టెంట్‌కోట ఓటీటీల్లోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








